Political news Maharashtra : మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం కనబరిచినప్పటికీ, లాతూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 70 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 43 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, లాతూర్‌లో బీజేపీ ఓటమికి ప్రత్యేక కారణం ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఈ ఫలితంపై ప్రభావం చూపినట్టు భావిస్తున్నారు. లాతూర్ ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి Vilasrao Deshmukh జ్ఞాపకాలపై చేసిన వ్యాఖ్యలు ప్రజలను తీవ్రంగా కలిచివేశాయని అంటున్నారు.
Read Also: Anaganaga Oka Raju Movie: ‘అనగనగా ఒక రాజు’- సినిమా ఎలా ఉందంటే?
ఎన్నికలకు ముందు లాతూర్‌లో పార్టీ కార్యకర్తలతో (Political news Maharashtra) సమావేశమైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర చవాన్, విలాస్‌రావు స్వస్థలమైన ఈ ప్రాంతంలో ఆయన జ్ఞాపకాలను తొలగించాలంటూ పిలుపునిచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర అభివృద్ధికి విశేష సేవలందించిన నాయకుడిని అవమానించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది.
ఈ వివాదంపై విలాస్‌రావు దేశ్‌ముఖ్ తనయుడు, నటుడు Riteish Deshmukh కూడా స్పందించారు. తన తండ్రి జ్ఞాపకాలను ప్రజల హృదయాల నుంచి ఎవరూ చెరిపివేయలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాల తర్వాత రవీంద్ర చవాన్ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గుతూ రితేశ్ దేశ్‌ముఖ్‌కు క్షమాపణలు చెప్పారు. తాను విలాస్‌రావుపై విమర్శలు చేయలేదని వివరణ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: