Bangladesh crime: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై కొనసాగుతున్న దాడుల పరంపరపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఖండించింది. ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్(Randhir Jaiswal) స్పష్టం చేశారు.

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై హింస
అతివాద మూకలు హిందువులకు(Hindu Minority Attacks) చెందిన ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత శత్రుత్వాలు, రాజకీయ ప్రేరణలతో జరుగుతున్న ఈ ఘటనలు మైనారిటీ వర్గాల్లో భయాందోళనలను పెంచుతున్నాయని అన్నారు. మైనారిటీల ప్రాణ, ఆస్తి భద్రతను కల్పించడం బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యతేనని భారత విదేశాంగ శాఖ గుర్తుచేసింది. ఇదే సమయంలో ఈ అంశం అంతర్జాతీయంగా కూడా చర్చకు దారితీసింది.
బ్రిటన్‌కు చెందిన పార్లమెంట్ సభ్యురాలు ప్రీతి పటేల్ ఈ ఘటనలపై స్పందిస్తూ, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో జోక్యం చేసుకోవాలని బ్రిటన్ ఫారెన్ సెక్రటరీకి లేఖ రాసినట్లు సమాచారం. మైనారిటీల హక్కులు, మత స్వేచ్ఛను కాపాడేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు దక్షిణాసియా ప్రాంత స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: