కలెక్టర్ తో భేటీ. సిద్దిపేట(Siddipet) జిల్లా నూతన కమిషనర్ ఆఫ్ పోలీస్ గా సాధన రష్మీ ప రుమాళ్ ఐపిఎస్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. హైమావతి గారిని మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. 2019 ఐపిఎస్ బ్యాచ్ కి చెందిన ఆమె హైద్రాబాద్ నార్త్ జోన్ డిసిపి గా పనిచేసి బదిలీపైన జిల్లాకు విచ్చేశారు. ఇక్కడ పనిచేసిన విజయ్ కుమార్(Siddipet) ఎస్బి జాయింట్ కమిషనర్ పోలీస్ హైదరాబాద్ గా బదిలీ అయ్యారు. జిల్లాలో శాంతి భద్రతలు మరియు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గూర్చి కాసేపు ఇరువురు చర్చించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: