Venezuela US war : CPI (ML) Pratighatana రాష్ట్ర కమిటీ, వెనిజువెలాపై అమెరికా చేపట్టిందని ఆరోపిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని తీవ్రంగా ఖండించింది. అలాగే వెనిజువెలా అధ్యక్షుడు Nicolás Maduro మరియు ఆయన భార్యను అపహరించేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
గత శనివారం వెనిజువెలాపై అమెరికా దురాక్రమణ యుద్ధం చేపట్టిందని, దేశ రాజధాని Caracas లో సుమారు 120 యుద్ధ విమానాలతో బాంబు దాడులు నిర్వహించి వంద మందికి పైగా పౌరులను హతమార్చిందని పార్టీ ఆరోపించింది. మూడు రాష్ట్రాల్లోని నగరాలపై కూడా బాంబు దాడులు జరిగాయని, అధ్యక్షుడిని రాజభవనం నుంచి బంధించారని పేర్కొంది.
నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కూల్చివేసి, తమకు (Venezuela US war) అనుకూలమైన కీలుబొమ్మ పాలనను నెలకొల్పాలనే ఉద్దేశంతో United States చాలా కాలం క్రితమే ఈ కుట్రను పన్నిందని సీపీఐ(ఎంఎల్) ప్రతిఘటన ఆరోపించింది. వెనిజువెలాలో ఉన్న అపార చమురు వనరులే ఈ దాడులకు అసలు కారణమని తెలిపింది.
Nara Lokesh : చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు
మాదకద్రవ్యాల కార్టెల్స్, ఉగ్రవాదం అనే నెపంతో యూఎస్ సామ్రాజ్యవాదం వెనిజువెలాను ఆక్రమించి ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోందని పార్టీ విమర్శించింది. లాటిన్ అమెరికా దేశాలు అమెరికా ఆధిపత్య విధానాలను తిరస్కరిస్తున్నాయని, అక్కడి ప్రజలు సామ్రాజ్యవాద ఆదేశాలను అంగీకరించడం లేదని తెలిపింది. లాటిన్ అమెరికా దేశాలపై ఆధిపత్యం చెలాయించాలనే అమెరికా ప్రభుత్వ ధోరణిని తీవ్రంగా ఖండించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: