Health: తేనె మన ఆహారంలో తరచుగా వాడే ఒక సహజ పదార్థం. దీన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి లేదా ఇతర పానీయాల్లో తీసుకోవచ్చు. ఆయుర్వేద వైద్యుల సూచన ప్రకారం, రోజూ ఉదయాన్నే ఒక టీస్పూన్ తేనె (Honey) తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సహజంగా తయారైన తేనెలో సహజ ఎంజైమ్‌లు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో ఇది శరీరానికి చాలా ఉపయోగకరం.
Read also: Nutrition tips: రెయిన్‌బో డైట్‌తో రంగులే ఆరోగ్యం!

Health: ప్రతి రోజూ తేనె తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
జీర్ణ వ్యవస్థకు లాభాలు
Health: తేనెను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల పిత్తాశయం ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ పనితీరు మెరుగుపడుతుంది, శరీరంలోని టాక్సిన్లు బయటకు బయల్దేరుతాయి, శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. తేనె ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది, జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చేస్తుంది. కాబట్టి జీర్ణ సమస్యలు, కడుపులో మంట, అజీర్తి, గుండెల్లో మంట వంటి సమస్యలు తగ్గుతాయి.
రోగ నిరోధక శక్తి పెంపు
తేనెలో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి, వాపులు, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పటిష్టమవుతుంది. సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు, ఇన్‌ఫెక్షన్‌ల రాకుండా చేస్తుంది. తేనెలో సహజ చక్కెరలు (ఫ్రక్టోజ్, గ్లూకోజ్) ఉండటంతో శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
బరువు తగ్గేందుకు సహాయం
తేనెను ఉదయం తీసుకోవడం శరీర మెటాబాలిజాన్ని వేగవంతం చేస్తుంది, దీని వలన క్యాలరీలు ఖర్చవుతాయి, కొవ్వు కరుగుతుంది, బరువు తగ్గడం సులభం అవుతుంది.
గొంతు మరియు శ్వాస సంబంధ సమస్యలలో లాభం
తేనెలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉండటంతో గొంతులో మంట, నొప్పి, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. గోరు వెచ్చని నీటిలో లేదా నిమ్మకాయతో కలిపి తాగితే మరింత ప్రభావవంతం అవుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: