జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 30 వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ(Congress Party) గెలుపు సాధిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో 4 వేల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మహిళల అభ్యున్నతి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు మోసం చేశాయని రేవంత్ విమర్శించారు. “మన ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నా వారిని చూసి ఈ రెండు పార్టీలు ఓర్వలేకపోతున్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. మహిళా సెంటిమెంట్ పేరుతో బీఆర్ఎస్కు ఓటు వేస్తే మళ్లీ మోసపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Read Also: Hyderabad: చిన్నారిపై డ్యాన్స్ మాస్టర్ అత్యాచారం

కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి, “వేల కోట్ల ఆస్తులు సంపాదించిన కేటీఆర్ తన చెల్లెలికీ పావులా కూడ ఇవ్వలేదని” వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అవినీతి కేసులో మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
“కేసీఆర్‌ను బీజేపీ కాపాడుతోంది. రెండు పార్టీలు కలసి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నంలో ఉన్నాయి. అవసరమైతే బీఆర్ఎస్–బీజేపీ విలీనం జరగొచ్చని పరిస్థితి ఉంది” అని రేవంత్(CM Revanth Reddy) ఆరోపించారు. అలాగే ఫార్ములా ఈ కారు కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆయన విమర్శించారు. చివరగా, సోనియా గాంధీ ఆదేశాల మేరకు అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చామని రేవంత్ స్పష్టం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: