हिन्दी | Epaper

Neeraj Chopra: గ్రెనడా స్టార్ అండర్సన్ పీటర్స్‌ను అధిగమించి అగ్రస్థానం కైవసం చేసుకున్న నీరజ్‌

Anusha
Neeraj Chopra: గ్రెనడా స్టార్ అండర్సన్ పీటర్స్‌ను అధిగమించి అగ్రస్థానం కైవసం చేసుకున్న నీరజ్‌

భారత జావెలిన్ త్రో దిగ్గజం, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మరోసారి తన అద్భుత ప్రతిభను ప్రపంచానికి చాటాడు. ఇటీవల అంతర్జాతీయ క్రీడా వేదికలపై వరుసగా విజయ పరంపరను కొనసాగిస్తున్న నీరజ్, ఇప్పుడు పురుషుల జావెలిన్ త్రో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు. ఇది భారత క్రీడాకారుల గర్వకారణంగా నిలిచింది.ఈ క్రమంలో గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్‌ (Anderson Peters) ను వెనక్కి నెట్టాడు.ఈ వారం వరల్డ్ అథ్లెటిక్స్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నీరజ్ చోప్రా 1,445 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.రెండో స్థానంలో ఉన్న అండర్సన్ పీటర్స్ 1,431 పాయింట్లతో కొనసాగుతున్నాడు.

రజత పతక విజేత జాకుబ్ వడ్లెజ్

ఈ ఏడాది దోహా డైమండ్ లీగ్‌లో 91.06 మీటర్ల రికార్డు త్రో విసిరిన జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ మూడో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ స్టార్ అర్షద్ నదీమ్ 1,370 పాయింట్లతో నాలుగో స్థానంలో, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత జాకుబ్ వడ్లెజ్ (చెక్ రిపబ్లిక్) ఐదో స్థానంలో ఉన్నాడు. గతేడాది సెప్టెంబర్ 2024లో జరిగిన పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) తర్వాత నీరజ్ తన నంబర్ వ‌న్‌ ర్యాంకును కోల్పోయిన విష‌యం తెలిసిందే. దాంతో పీటర్స్ అగ్ర‌స్థానాన్ని అధిరోహించాడు. ఆ ఒలింపిక్స్‌లో నీరజ్ 89.45 మీటర్ల త్రోతో రజతం గెలవగా, పీటర్స్ కాంస్య పతకం సాధించాడు. అయితే, 2025లో నీరజ్ అద్భుతమైన ఫామ్‌తో తిరిగి వచ్చాడు. ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన పోచ్ ఇన్విటేషనల్ టోర్నీ (Invitational Tournament) లో విజయంతో ఈ ఏడాదిని ప్రారంభించాడు. ఆ తర్వాత దోహా డైమండ్ లీగ్‌లో తన కెరీర్‌లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును దాటి, 90.23 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు.

Neeraj Chopra: గ్రెనడా స్టార్ అండర్సన్ పీటర్స్‌ను అధిగమించి అగ్రస్థానం కైవసం చేసుకున్న నీరజ్‌
Neeraj Chopra

ప్రధాన టోర్నమెంట్ల ఫైనల్స్‌లో పీటర్స్‌పై

అదే నెలలో పోలాండ్‌లో జరిగిన జానస్ కుసోసిన్‌స్కీ మెమోరియల్ టోర్నీలోనూ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఇక ఈ నెలలో పారిస్ డైమండ్ లీగ్ (88.16 మీటర్లు), ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ (85.29 మీటర్లు) టోర్నీలలో వరుసగా స్వర్ణాలు గెలిచి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ ఏడాది పీటర్స్‌తో తలపడిన నాలుగు పోటీల్లోనూ నీరజ్ చోప్రా (Neeraj Chopra) నే విజయం సాధించడం విశేషం. ఓవరాల్‌గా ప్రధాన టోర్నమెంట్ల ఫైనల్స్‌లో పీటర్స్‌పై నీరజ్ 16-5 తేడాతో ఆధిక్యంలో ఉన్నాడు. ఇక‌, ఈ ఇద్దరు స్టార్ అథ్లెట్లు జూలై 5న బెంగళూరులో జరగనున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్‌లో మరోసారి తలపడనున్నారు. దీంతో వీరి మధ్య పోటీపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Read Also: Shikhar Dhawan: ధోనీని తొలిసారి చూసినప్పుడు బాలీవుడ్ హీరోలా కనిపించాడన్న శిఖర్ ధావన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

హర్మూజ్ జలసంధిలో ‘మైన్స్’ వార్..ఆయిల్ సరఫరాకు ముప్పు!

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

భారతీయుల భద్రతపై ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ కానున్న జెలెన్స్కీ

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

గ్యాస్ కొరత: గ్యాస్ స్టవ్‌కు ప్రత్యామ్నాయాల వైపు పరుగులు

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

యుద్ధంలోనూ ఆర్థికంగా ఎలా గెలుస్తోంది? అసలు రహస్యం ఏంటి?

📢 For Advertisement Booking: 98481 12870