हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

KA Paul: జగన్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

Anusha
KA Paul: జగన్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం లో ప్రెస్ క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన పలువురు రాజకీయ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అసలు క్రిస్టియనే కాదని, ఆయన శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుడని, చిన్నజీయర్ స్వామికి శిష్యుడని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ వివాదాన్ని సృష్టించి హిందూ, క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టాలని చూశారని ఆరోపించారు. జగన్(Ys Jagan) ఎన్నడూ తనను కలవలేదని, చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం వల్లే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని ఆయన విమర్శించారు.రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులైనా ఆ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని పాల్ విమర్శించారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ సీమకు ఏం చేశారని ఆయన నిలదీశారు. ఆర్డీటీ సంస్థ,ఎక్కువగా ప్రజలకు సేవలందించిందని కొందరు అంటున్నారని చెప్పారు. అలాంటి సంస్థకు ఎన్నికల పేరుతో ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను నిలిపివేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్డీటీకి(RDT) ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి నేతలే దీనిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రంలో రెండో కీలక వ్యక్తితో మాట్లాడానని, ఆర్డీటీకి న్యాయం జరగకపోతే ప్రపంచాన్ని దించుతానని హెచ్చరించారు. ఇదే తన డెడ్‌లైన్ అని స్పష్టం చేశారు.

విశ్వగురు

ఎన్నికల ముందు 30 వేల మంది అదృశ్యమైన అమ్మాయిల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ విషయాన్ని మరిచిపోయారని, ఒకప్పుడు మోదీని విమర్శించి ఇప్పుడు ఆయనే గొప్ప ప్రధాని అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సైతం గతంలో మోదీని దుమ్మెత్తిపోసి, ఇప్పుడు విశ్వగురు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారని విమర్శించారు. లోకేశ్ అయితే మోదీని వంద మిసైళ్లతో పోల్చారని, కానీ ఆ మిసైల్ హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టే ‘పడిపోయే మిసైల్’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్, రేవంత్ రెడ్డి, జగన్, కేసీఆర్, కేటీఆర్ వంటి నేతలంతా మోదీకి తొత్తులుగా మారిపోయారని పాల్ ఆరోపించారు. వారెవరూ మోదీని ధైర్యంగా ఎదుర్కోలేరని, ఆ దమ్మున్నది కేవలం తనకు మాత్రమేనని అన్నారు. ఏపీ, తెలంగాణల్లో చెరో వంద సీట్లలో తన పార్టీని గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతానని, లేదా 42 ఎంపీ సీట్లిస్తే ప్రధానమంత్రి అయి దేశాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు పిలుపునిచ్చారు.

 
KA Paul: జగన్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
KA Paul,Jagan

ఆవేదన

తెలంగాణకు అప్పు పుట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వాపోతున్నారని, ఆయన ఏడుపు చూస్తుంటే జాలి వేస్తోందని పాల్ వ్యాఖ్యానించారు. 1989లో తాను అమెరికా వెళ్లినప్పుడు భారత్, చైనా జీడీపీ సమానంగా ఉండేదని, కానీ ఇప్పుడు చైనా మనకంటే ఏడు రెట్లు అభివృద్ధి చెంది వంద దేశాలకు అప్పులిస్తుంటే, భారత్ మాత్రం వంద దేశాల వద్ద అప్పులు తీసుకునే దుస్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అప్పులు తీర్చాలన్నా, హైదరాబాద్ వంటి నగరాలను తెలుగు రాష్ట్రాల్లో నిర్మించాలన్నా, యువతకు ఉద్యోగాలివ్వాలన్నా కేఏపాల్(KA Paul) అధికారంలోకి రావాలని, ‘పాల్ అన్న రావాలి పాలన మారాలి’ అని ఆయన నినదించారు.

Read Also: Andhra Pradesh: కొత్త రేషన్ కార్డులతో పాటూ మార్పులు కూడా చేసుకోవచ్చు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870