हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Andhra Pradesh: ఏపీ యువతకు ప్రభుత్వం శుభవార్త

Anusha
Andhra Pradesh: ఏపీ యువతకు ప్రభుత్వం శుభవార్త

ఏపీ లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటుగా ప్రైవేటు రంగంలో కూడా యువతకు పెద్దగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు అవకాశం కల్పిస్తోంది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం ఒరాకిల్, ష్నైడర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా యువతకు ఉచితంగా ఒరాకిల్ క్లౌడ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

వివరాలు

రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలో యువతకు శిక్షణనిచ్చేందుకు ఒరాకిల్‌ కంపెనీతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఒప్పందం చేసుకుంది. ఈమేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో సోమవారం నాడు ఒరాకిల్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ద్వారా ఎంపికచేసిన యువతకు ఒరాకిల్‌ యూనివర్సిటీ లెర్నింగ్‌ సబ్‌స్క్రిప్షన్‌ కంటెంట్‌ ఉచితంగా లభిస్తుంది. మహిళలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాల యువతకు ఒరాకిల్‌ క్లౌడ్‌ నైపుణ్యాలు అందించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.దీనిలో భాగంగా మొదటి సంవత్సరం లక్ష, రెండు, మూడు సంవత్సరాల్లో ఒక్కో ఏడాదికి లక్షన్నర మంది చొప్పున మొత్తం 3 ఏళ్లలో 4 లక్షల మందికి ఒరాకిల్‌ మైలెర్న్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో శిక్షణనిస్తారు. ఇందుకోసంఅభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తారు. ఇక ఒరాకిల్‌ అందించే సేవల కోసం ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ రూపొందించనుంది.

 Andhra Pradesh: ఏపీ యువతకు ప్రభుత్వం శుభవార్త

పరిశ్రమ

ఎలక్ట్రానిక్స్, హరిత ఇంధనం, నిర్మాణ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఒప్పందం కుదుర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రతిభావంతులైన యువతను తయారుచేయడమే ఈ ఒప్పందం ముఖ్య లక్ష్యం.దీనిలో భాగంగా 2027 మార్చి వరకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్‌ కాలేజీలు, న్యాక్‌ శిక్షణ కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో సుమారు తొమ్మిది వేల మంది యువతకు శిక్షణనిస్తారు. మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి మేరకు మంగళగిరిలో రూ.15 కోట్లతో ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పనకు దారి చూపనున్నారు.

Read Also: Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే లైన్‌ ఎక్కడంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

📢 For Advertisement Booking: 98481 12870