हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: ఏపీ లో కొత్త సూపర్ ఫాస్ట్- హాల్ట్ స్టేషన్లు ఇవే

Anusha
Andhra Pradesh: ఏపీ లో కొత్త సూపర్ ఫాస్ట్- హాల్ట్ స్టేషన్లు ఇవే

వేసవి సెలవుల్లో రైల్వేకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీసీజన్‌లో.వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.అదే సమయంలో సదరన్ రైల్వే అధికారులు కొత్తగా ఓ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టారు. డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి రాజస్థాన్‌లోని భగత్ కీ కోఠి మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ ఇది. ఈ నెల 5వ తేదీన ఈ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కబోతోంది. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే అధికారులు దీన్ని ప్రవేశపెట్టారు. వారంలో అయిదు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందీ ఎక్స్‌ప్రెస్. 5వ తేదీన ఈ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మంత్రులు పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

ఎక్స్‌ప్రెస్

ఈ నెల 5వ తేదీ నుంచి ప్రతి సోమ, మంగళ, గురు, శుక్ర, ఆదివారాల్లో సాయంత్రం 7:45 నిమిషాలకు చెనై సెంట్రల్ నుంచి బయలుదేరే 20625 ఎక్స్‌ప్రెస్ రెండో రోజు మధ్యాహ్నం 12:15 నిమిషాలకు భగత్ కీ కోఠీకి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో ప్రతి సోమ, బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో తెల్లవారు జామున 5:30 గంటలకు భగత్ కీ కోఠీ నుంచి బయలుదేరే నంబర్ 20626 ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు ఉదయం 11:15 నిమిషాలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది.సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, బల్లార్షా, చంద్రాపూర్, వార్ధా, ధమన్‌గావ్, బద్నేరా, అకోలా, మల్కాపూర్, భుసావాల్, జల్‌గావ్, నందుర్బార్, ఉద్నా, భరూచ్, వడోదర, సబర్మతి, మెహసానా, భిల్డీ, రాణీవారా, మర్వార్ భిన్మల్, జాలోర్, సమ్దారి, లూణీ మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది.

Read Also: Street dogs: వీధి కుక్కలకు బలైన నాలుగేళ్ళ బాలుడు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870