हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Pakistan India War: మారని పాక్ బుద్ధి.. భారత సైన్యంపై మళ్ళీ కాల్పులు

Vanipushpa
Pakistan India War: మారని పాక్ బుద్ధి.. భారత సైన్యంపై మళ్ళీ కాల్పులు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సంయవనం పాటించాల్సిన పాకిస్థాన్ సరిహద్దులో వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. నియంత్రణ రేఖ వద్ద దుశ్చర్యకు పాల్పడుతోంది. గత ఐదు రోజుల పాటు సరిహద్దులోకాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన దాయాది దేశం తాజాగా బుధవారం 6వ రోజు కూడా భారత సైన్యంపై కాల్పులకు తెగబడింది. దీంతో పాక్-భారత్ సరిహద్దులో రెండు దేశాల మధ్య ఏం జరుగుతోందో అన్న భయాందోళనలు నెలకొన్నాయి.

మారని పాక్ బుద్ధి.. భారత సైన్యంపై మళ్ళీ కాల్పులు

పాక్‌ సైన్యం కాల్పులు
ఏప్రిల్ 29-30 అర్ధరాత్రి జమ్ముకశ్మీర్‌లోని నాలుగు సరిహద్దు జిల్లాల్లో పలు సెక్టార్లలో భారత సైన్యం పైకి కాల్పులు జరిపింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న పరగ్వాల్‌ సెక్టార్‌తో పాటు రాజౌరీ జిల్లాలోని సుందర్‌బనీ, నౌషెరా, అఖ్నూర్ సెక్టార్లలో పాక్‌ సైన్యం కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. అయితే భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ కాల్పులకు పాల్పడినట్లుగా పేర్కొన్నాయి. అటూ బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోనూ కవ్వింపు చర్యలకు దిగినట్లుగా తెలుస్తోంది. శత్రువుల దాడికి మన బలగాలు సమర్థమంతంగా తిప్పికొట్టాయని సైనిక వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ 24 అర్ధరాత్రి నుంచి వరుసగా ప్రతిరోజూ పాక్‌ సైన్యం భారత దళాలపై ఎల్​ఓసీ వెంబడి కాల్పులు జరుపుతున్నాయి. దీటుగా భారత్​ ఆర్మీ బదులిస్తోంది.


‘8ఏళ్ల తర్వాత ఈ రకమైన కాల్పులను చూశాం’
ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రతి రాత్రి పాక్ సైన్యం నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడింది. బుధవారం (ఏప్రిల్ 30) ఆరు రోజుల వరుస దుశ్చర్యకు దారితీయడం వల్ల పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. బుధవారం అర్ధరాత్రి అనేక రౌండ్ల కాల్పులు జరిగినట్లు శబ్దాలు వినిపించాయని పరగ్వాల్ స్థానికులు చెబుతున్నారు.

10-12 రౌండ్ల కాల్పులు

దాదాపు 10-12 రౌండ్ల కాల్పులు జరిగాయని, అందుకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని పరగ్వాల్ నివాసి అంకుర్ సింగ్ తెలిపారు. అయితే దాదాపు 7-8 సంవత్సరాల తర్వాత ఈ రకమైన కాల్పుల విరమణ ఉల్లంఘన జరగడం చూశామని తెలిపారు. ప్రస్తుతం మేం హై అలర్ట్​లో ఉన్నామని తెలిపారు. మేం పొల్లాల్లో పని చేస్తున్నప్పుడు బుధవారం రాత్రి 9గంటల సమయంలో కాల్పులు జరిగాయని మరో స్థానికుడు రాజు సింగ్ అన్నారు. పనులను ఆపేసి వెంటనే ఇళ్లకు రావాలని తమకు కాల్ వచ్చిందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం మొదలైన ఈ సంఘటనల పరంపర ఉగ్రవాదం మీదే కాదు, ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే ముప్పుగా మారింది.

ఈ కాల్పుల కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రివేళల కాల్పులు, అప్రమత్తంగా ఉండే పరిస్థితులు సాధారణ జీవితాన్ని దెబ్బతీస్తున్నాయి. పాకిస్తాన్ ప్రవర్తన దానికే బద్ధకట్టు వేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. భారత పరిరక్షణ సైన్యానికి ఇది మరో మేజర్ విజిలెన్స్ పిలుపు.

Read Also: Jammu : లోయలో పడ్డ CRPF జవాన్ల వాహనం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870