हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Pahalgam Attack: పహల్గామ్ దాడిపై స్పందించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ

Anusha
Pahalgam Attack: పహల్గామ్ దాడిపై స్పందించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులు, అందులోనూ పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.అయితే ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు స్పందించ‌డంతో పాటు క‌శ్మీర్‌కు అండ‌గా నిలుస్తుండ‌గా,

విధానం

తాజాగా ఈ ఘ‌ట‌న‌పై స్పందించాడు బాలీవుడ్ న‌టుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, నాకు ఎంతో కోపం, బాధ కలుగుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై మన ప్రభుత్వం వేగంగా పనిచేస్తోంది, తప్పకుండా న్యాయం జరుగుతుంది. మనమందరం అదే ఆశిస్తున్నాం. జరిగింది నిజంగా చాలా విషాదకరం. ఇది సిగ్గుచేటు,” అని ఆయన అన్నారు. ఈ ఘ‌ట‌న‌తో పర్యాటక రంగం బాగా దెబ్బతింది. కానీ అంతకంటే ఎక్కువ, అక్కడి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు ఎందుకంటే మేమందరం సోదరులం. కాశ్మీర్ ప్ర‌జ‌లు సందర్శకులను స్వాగతించే విధానం డబ్బుకు మించినది. అక్కడ నేను ఎంతో ప్రేమను చూశాను. కాశ్మీరీల హృదయాలలో మనందరి కోసం ఉన్న ప్రేమను నేను వర్ణించలేను. అక్కడికి ప్రయాణించేవారు తిరిగి వచ్చినప్పుడు కాశ్మీరీలను ఎంతో ప్రశంసిస్తారు. వారు నిజంగా దానికి అర్హులు. ఈ సంఘటన తర్వాత, కాశ్మీర్‌ ప్రజలు కలత చెందారు, వారు ఆగ్రహంగా ఉన్నారు, వారి భూమిపై ఇది ఎలా జరిగిందని ప్రశ్నిస్తున్నారు. అని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఏకం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి దుఃఖ సమయంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ కలిసి నిలబడటం గర్వించదగ్గ విషయం అని చెప్పుకోచ్చాడు.

  Pahalgam Attack: పహల్గామ్ దాడిపై స్పందించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ

పారిపోయి

జమ్ము కశ్మీర్‌లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు.సైనిక దుస్తుల్లో వచ్చి పర్యటకులను చుట్టుముట్టారు. వారి పేర్లు అడుగుతూ ముఖ్యంగా హిందువులు, పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోగా 20 మంది వరకు గాయపడ్డారు. అయితే ఘటన అనంతరం ముష్కరులు అడవుల్లోకి పారిపోగా విషయం తెలుసుకున్న భారత బలగాలు క్షతగాత్రులకు సాయం చేశారు. ఆపై పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.13 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో పౌరులపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. మరోవైపు, పాకిస్థాన్ సైతం సరిహద్దుల్లో అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడితో భారత్‌ తమపై 2019 పుల్వామా ఆత్మాహుతి ఘటన తర్వాత దాడిచేసినట్టు మరోసారి మెరుపు దాడులకు దిగుతుందేమోనని దాయాది భావిస్తోంది.

Read Also: Pahalgam Attack: పహల్‌గామ్‌లో ఉగ్రదాడిపై స్పందించిన అజిత్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870