हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Phalgam Terror Attack: పహల్గామ్ దాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి

Anusha
Phalgam Terror Attack: పహల్గామ్ దాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ దారుణానికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని కోరింది. అంతేకాదు, ఉగ్రవాదులకు మద్దతిస్తూ,ఆర్థికంగా సాయపడుతోన్న వాళ్లను కూడా బాధ్యులను చేసి చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ప్రతిపాదనను ఆమోదిస్తూ భద్రతా మండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న ఫ్రాన్స్ ఓ ప్రకటన చేసింది. ఉగ్రవాదులను శిక్షించాలని మండలి నొక్కి చెప్పింది. అయితే, 2019 నాటి పుల్వామా ఆత్మాహుతి దాడిలో భారత ప్రభుత్వానికి సహకరించాలని కోరింది.ఈసారి భారత పేరు చెప్పకుండా అన్ని సంబంధిత అధికారులకు సహకరించాలని పేర్కొంది. కానీ ఈ ప్రకటనను చైనా మద్దతుతో దాయాది నీరుగార్చడానికి ప్రయత్నించింది. పహల్గామ్ ఉగ్రదాడిలో తమ ప్రమేయం లేదని పాకిస్థాన్ బుకాయించింది. అంతేకాదు, యూఎన్ఎస్ సి ప్రకటనలోని పదాలను మార్చడానికి చైనా, పాక్‌లు ప్రయత్నించాయి. ఈ దాడిలో తమ ప్రమేయం లేదని చెబుతూనే ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు మొసలి కన్నీళ్లు కార్చింది.

మండలి

ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన భద్రతా మండలి ‘ఉగ్రవాదం అన్ని రూపాల్లో అంతర్జాతీయ శాంతికి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమించింది’ అని పేర్కొంది. ఇలాంటి చర్యలు ఎక్కడ, ఎప్పుడు, ఎవరు చేసినా నేరమని యూఎన్ఎస్సీ తెలిపింది. అమెరికా ప్రతిపాదనపై ఏకాభిప్రాయం రావడానికి ముందు అనేక చర్చలు జరిగాయి. పాకస్థాన్, చైనాతో కలిసి ప్రకటనలోని పదాలను మార్చడానికి ప్రయత్నించింది. గతంలో పుల్వామా, జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు దాడి వంటి ఉగ్రదాడులను మండలి ఖండించింది. స్థానిక ప్రభుత్వానికి సహకరించాలని కోరింది.ఐరాస ప్రకటనలో భారత ప్రభుత్వ ప్రస్తావన ఉంటే తమకు ఇబ్బంది తప్పదని పాక్ భావించింది. ఈ ప్రకటనకు ముందు చైనాతో అభ్యంతరం చెప్పించింది. అలాగే, అందుకే తెలివిగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దాడిపై ‘నిష్పక్షపాతంగా, పారదర్శకంగా’ విచారణ జరుపుతామని చెప్పారు. అందుకే భారత ప్రభుత్వం అనే ప్రస్తావించకుండా సంబంధిత అధికారులకు సహకరించాలని ఐరాస తన ప్రకటనలో తెలిపింది.

  Phalgam Terror Attack:పహల్గామ్ దాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి

రక్షించుకునేందుకు

మరోవైపు, భారత్, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని, దీన్ని ఐరాస నిశితంగా గమనిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు. పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలని భారత్, పాక్‌లను కోరింది.పహల్గామ్ దాడితో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన స్థానికులు అనుకోని పరిస్థితులు ఎదురైతే తమను తాము రక్షించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శత్రువుల దాడుల నుంచి రక్షణగా ప్రభుత్వం కొన్నేళ్లుగా బంకర్లను నిర్మిస్తోంది. ఈ బంకర్లలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తమ పంటలను కోసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లనున్నట్లు స్థానికులు తెలిపారు.

Read Also: Phalgam Terror Attack: పహల్గామ్‌ ఉగ్రదాడితో సంబంధం లేదన్న పాకిస్థాన్ స్పందించిన ఒమర్ అబ్దుల్లా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870