हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

TTD: ఉగ్రదాడులతో టీటీడీ కి మరింత భద్రత

Anusha
TTD: ఉగ్రదాడులతో టీటీడీ కి మరింత భద్రత

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేసారు. పోలీసులు విజిలెన్స్ అలర్ట్ అయింది. ఎలాంటి ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ బందో బస్తు ఏర్పాటు చేసారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇదే సమయంలో టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది.తిరుపతి, తిరుమలలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. తిరుపతిలో ఉన్న ప్రధాన ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్‌, విష్ణునివాసం, మాధవం, అన్ని ఆలయాల దగ్గర ముందస్తు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతిలో అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే తిరుపతిలోని అన్ని రోడ్లు, ముఖ్య కూడళ్లలో బాంబు, డాగ్‌ స్క్వాడ్లు తనిఖీలు చేస్తున్నాయి. బాంబు స్క్వాడ్‌లు రంగంలోకి దిగి లాడ్జీలు, కొన్ని భవనాల్లో తనిఖీ చేశారు. అలాగే ఆలయాల దగ్గర భద్రత పెంచారు.వాహనాల తనిఖీలు చేస్తున్నారు. శ్రీవారి ఆలయం పైభాగంలో, గొల్లమండపం వద్ద సాయుధ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తిరుమలలోని సీసీ కెమెరాల పనితీరుపై దృష్టిసారిం చారు. సీసీ కెమెరాల్లో ప్రతి ఒక్కరి కదలికపైనా నిఘా ఉంచాలని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బందిని ఆదేశించారు.

ఉగ్రవాదులు

తిరుపతి, తిరుమలలో మొత్తం 75 ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేసాయి. అలిపిరి సమీపంలో చెక్‌ పాయింట్‌ దగ్గర భద్రతను పెంచారు.వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తిరుమల రెండు ఘాట్‌ రోడ్లలో తనిఖీ చేపట్టారు.ఘాట్‌లోని లింకు రోడ్డులో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు కట్టుదిట్టం చేశారు. తిరుపతిలోని అన్ని రోడ్లు, ముఖ్య కూడళ్లలో బాంబు, డాగ్‌ స్క్వాడ్లు తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే బాంబు నిర్వీర్యం చేసే దళాలు రంగంలోకి దిగి లాడ్జీలు, కొన్ని భవనాలు పరిశీలిస్తున్నారు. ఆలయాల వద్ద భద్రత పెంచారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి స‌ర్కిల్ వ‌ద్ద ఉన్న సుద‌ర్శ‌న్‌ స‌త్రంలో భద్రతా దళాల మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు.

 TTD: ఉగ్రదాడులతో టీటీడీ కి మరింత భద్రత

మాక్ డ్రిల్

ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భ‌ద్ర‌తా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. అసాల్ట్ డాగ్ ఎనిమీ ఎటాక్‌, రూమ్ ఇన్ట‌ర్వెన్ష‌న్ కార్య‌క‌లాపాలు చేసి చూపారు. దాదాపు ఒక‌టిన్న‌ర గంట‌పాటు ఈ మాక్ డ్రిల్ కొన‌సాగింది. ఈ మాక్ డ్రిల్ 28 మంది ఆక్టోప‌స్ కమాండోలు, 25 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 10 ఏపీఎస్పీ సిబ్బంది ఈ మాక్ డ్రిల్ లో భాగ‌మ‌య్యారు. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వేసవిలో రద్దీ పెరుగుతున్న వేళ భక్తులకు తమ దర్శన సమయానికి క్యూ లైన్లలోకి రావాలని టీటీడీ సూచిస్తోంది. అదే సమయంలో భద్రతా చర్యల్లో భాగంగా సెక్యూరిటీ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.


Read Also : AP Govt : ఏపీలో స్పౌజ్ పింఛ‌న్లు… ఈరోజు నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870