हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

NIA Report: సైబరాబాద్​లోనూ ఉగ్రదాడికి కుట్ర

Vanipushpa
NIA Report: సైబరాబాద్​లోనూ ఉగ్రదాడికి కుట్ర

హైదరాబాద్​ మహానగరంలో కరుడుగట్టిన ఉగ్రవాది, ముంబయి ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన డేవిడ్​ హెడ్లీ అలియాస్​ దావూద్​ గిలానీ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడా అంటే అవుననే అంటున్నాయి దర్యాప్తు సంస్థలు. అంతేకాదు అప్పట్లో సైబరాబాద్​లోనూ ఉగ్రదాడికి ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(ఎల్​ఈటీ) కుట్ర పన్నినట్లు గుర్తించారు. 2008 నాటి ముంబయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తహవ్వుర్​ హుస్సేన్​ రాణాను ఎన్​ఐఏ అమెరికా నుంచి రప్పించి విచారిస్తున్న సంగతి తెలిసిందే.

ఎల్​ఈటీ తరఫున పని చేసిన హెడ్లీ
ఇదే కేసులో దర్యాప్తులో భాగంగా అమెరికాలో ఫెడరల్​ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్ ​(ఎఫ్​బీఐ) అదుపులో ఉన్న హెడ్లీని 2010లో ఎన్​ఐఏ ఉన్నతాధికారులు విచారించగా నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను భారత్​పై యుద్ధం ప్రకటించిన ఎల్​ఈటీ తరఫున పని చేశానని హెడ్లీ విచారణలో అంగీకరించాడు. ఇలా హెడ్లీ చెప్పిన కీలక అంశాలతో ఎన్​ఐఏ 106 పేజీల నివేదికను రూపొందించింది. దీని ఆధారంగానే ఇప్పుడు తహవ్వుర్​ను ఎన్​ఐఏ ప్రశ్నిస్తున్నారు. ఆ నివేదికలోని అంశాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి.
హెడ్లీ చెప్పిన కీలక విషయాలు
“మేము నిర్వహించబోయే ఉగ్రదాడుల ప్రణాళికలో భాగంగా నేను అనేక మార్లు భారత్‌ను సందర్శించా. లష్కరే తోయిబా ‘దౌరా ఏ ఆమ్‌’ పేరుతో నిర్వహించిన 21 రోజుల ప్రాథమిక ఉగ్ర శిక్షణకు హాజరయ్యా. ఆయుధాల వాడకానికి సంబంధించి ‘దౌరా ఏ ఖాస్‌’ పేరుతో మూడు నెలలపాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణనూ పూర్తిచేశా. నన్ను పర్యవేక్షిస్తున్నవారు, సహచరులతో నిరంతరం రహస్యంగా ఎలా సంప్రదింపులు జరపాలో నిర్దేశించేందుకు ‘దౌరా ఎ రిబాత్‌’ పేరిట నిర్వహించిన మూడు వారాల శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత నన్ను ముజఫరాబాద్‌లో ‘ఐస్‌బాక్స్‌’ అని పిలుచుకునే సేఫ్‌ హౌస్‌కి తీసుకెళ్లారు.
దాడిలో హైదరాబాద్‌ కూడా ఉంది
భవిష్యత్తులో తాము భారతదేశంలో జరపబోయే దాడులకు సంబంధించిన వివరాలను ఎల్‌ఈటీకి చెందిన సాజిద్‌ మజీద్, అబు క్వహాఫా, ముజమ్మిల్‌లు వివరించారు.” అని ఎన్​ఐఏ విచారణలో హెడ్లీ కీలక విషయాలు వెల్లడించాడు. వాటికి సంబంధించిన కొన్ని మ్యాపులు, ఫొటోలు కూడా చూపారని హెడ్లీ విచారణలో వెల్లడించాడు. అందులో రాజ్​కోట్​లోని చమురుశుద్ధి కర్మాగారం, సైబరాబాద్​ మ్యాప్​ ఉందని తెలిపాడు. ఆ రెండు చోట్లా దాడులకు ఎల్​ఈటీ వ్యూహం పన్నినట్లు నాకు అర్థమైందన్నాడు. ఆ తర్వాత తమ అవసరాలకు అనుగుణంగా ఎల్​ఈటీ నన్ను భారత్​కు పంపాలని అనుకుందని చెప్పాడు. ఈ సందర్భంగా నేను నివసించడానికి అనుకూలమైన నగరాలపై చర్చ జరిగింది. ఆ జాబితాలో కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు, పుణె, నాగ్‌పుర్‌లతోపాటు హైదరాబాద్‌ కూడా ఉంది’’ అని హెడ్లీ వెల్లడించినట్టు ఎన్‌ఐఏ నివేదికలో ఉంది.
పర్యాటకుడి ముసుగులో హెడ్లీ
ఆ తర్వాత పర్యాటకుడి ముసుగులో లష్కరే తోయిబా హెడ్లీని ముంబయి పంపించి, రెక్కీ నిర్వహించిన అనంతరం దాడులకు పాల్పడింది. తదుపరి హెడ్లీ.. డెన్మార్క్‌లో విధ్వంసానికి ప్రణాళిక రచిస్తున్నట్లు గుర్తించిన ఎఫ్‌బీఐ అతన్ని అరెస్టు చేసింది. అప్పుడే ముంబయి ఉగ్రదాడిలో అతని ప్రమేయం బయటపడింది.

Read Also: Ukraine : అమెరికాతో ఖనిజాల ఒప్పందం పై తొలి అడుగు : ఉక్రెయిన్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870