Delimitation:ఒకే వేదికపై రేవంత్ రెడ్డి,కేటీఆర్

Delimitation:ఒకే వేదికపై రేవంత్ రెడ్డి,కేటీఆర్

2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోంది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల పెరుగుదల ఉండదని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఫలితంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయంగా లబ్ధిపొందుతాయనే భావన పెరుగుతోంది.ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

ఫెయిర్ డీలిమిటేషన్‌

డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశముండటంతో, దక్షిణాది రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం దక్కదని స్టాలిన్ అభిప్రాయపడుతున్నారు. అందువల్ల దక్షిణాదిన ఉన్న అన్ని మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు చెన్నైలో ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీ ముఖ్య డిమాండ్ “ఫెయిర్ డీలిమిటేషన్”.

సమావేశం ఏర్పాటు

ఈ సమావేశానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.రేవంత్ ,కేటీఆర్ ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.బీజేపీ-ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర పన్నుతోందంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు.ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బిజు జనతాదళ్ ప్రతినిధులు ఈ భేటీలో హాజరయ్యారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెన్నై చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. అయితే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా హాజరుకాలేనని స్పష్టం చేస్తూ స్టాలిన్‌కు లేఖ రాశారు. 

image

ప్రధాన పార్టీల ప్రాతినిథ్యం

తృణమూల్ కాంగ్రెస్‌కు కూడా ఆహ్వానం అందినప్పటికీ, ఆ పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. దక్షిణాదిలో తెలుగుదేశం, జనసేన మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తటస్థ వైఖరినే కొనసాగిస్తోంది. ఫలితంగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధాన పార్టీల ప్రాతినిథ్యం లేనట్టయింది.

డీలిమిటేషన్ ప్రక్రియ

కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆఆప్), లెఫ్ట్ పార్టీలతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రులు డీలిమిటేషన్ సమావేశానికి ఆహ్వానం అందింది.డీలిమిటేషన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అందుకే ఎక్కువమంది పిల్లలను కనాలంటూ విజ్ఞప్తి చేస్తూన్నారాయన.

Related Posts
Parliament: పార్లమెంట్‌ క్యాంటీన్ లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం
Parliament: పార్లమెంట్‌ క్యాంటీన్ లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం

అరకు కాఫీ పార్లమెంట్‌కి చేరిన అదృష్టం ఇకపై పార్లమెంట్‌లో ఎంపీలు అరకు కాఫీ రుచి చూడొచ్చు. ఇందుకోసం సోమవారం క్యాంటీన్ సంగం-1లో అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంటరీ Read more

ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం
Etikoppaka Toys Shakatam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అరుదైన గౌరవం లభించింది. ఈసారి జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే కవాతులో ఆంధ్రప్రదేశ్ తరఫున ఏటికొప్పాక బొమ్మల Read more

 త్వరలో మార్కెట్ లోకి రానున్నఐఫోన్ ఎస్ఈ 4
 త్వరలో మార్కెట్ లోకి ఐఫోన్ ఎస్ఈ 4

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ సరికొత్త ఐఫోన్ ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ నూతన ఫోన్, ఐఫోన్ ఎస్ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ 4 పేరుతో Read more

క్రికెట్ ఆడుతూ ఐటీ ఉద్యోగి మృతి
క్రికెట్ ఆడుతూ ఐటీ ఉద్యోగి మృతి

కృష్ణా జిల్లాలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఉద్యోగి మరణం హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొమ్మాలపాటి సాయికుమార్, కృష్ణా జిల్లా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *