BRS supports the Congress resolution

కాంగ్రెస్‌ తీర్మానానికి బీఆర్‌ఎస్‌ మద్దతు

హైదరాబాద్‌: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇచ్చేందుకు కేంద్రానికి ప్రతిపాదన పంపాలని శాసన సభలో తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానానికి బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు అసెంబ్లీలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. భారత రత్న పుస్కారం పొందేందుకు మన్మోహన్ సింగ్ పూర్తి అర్హులని కేటీఆర్ అన్నారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీగా మన్మోహన్ వ్యవహరించారని కొనియాడారు.

ఆయన ఓ నిరాడంబర మనిషి అని కీర్తించారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఏడాదిన్నర పాటు మంత్రిగా పని చేశారని గర్తు చేశారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు కావడం గర్వకారణమని కేటీఆర్ అన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిందని తెలిపారు. ప్రజాస్వామిక ఉద్యమాలకు ఆయన అండగా నిలబడ్డారని కొనియాడారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ఆర్థిక సంస్కరణల్లో ఏమాత్రం వెనక్కి తగ్గలేని అన్నారు. ఎన్ని నిందలు వేసినా.. ఆ స్థితప్రజ్ఞుడు వణకలేదు, తొణకలేదని కేటీఆర్ ప్రశంసించారు.

కాగా, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేశారు. ఆర్థిక వేత్తగా, కేంద్రమంత్రిగా, ప్రధానిగా కీలక పదవుల్లో కొనసాగారని తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ హయంలోనే తెలంగాణ ఏర్పడిందని సీఎం పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిలూదారని సీఎం వివరించారు.

Related Posts
తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో..?
telangana cs santhakumari

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత చీఫ్ సెక్రటరీ (సీఎస్) శాంతి కుమారి పదవీ కాలం ఏప్రిల్ 7న ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త సీఎస్ ఎవరు Read more

ప్రపంచాన్ని వణికిస్తున్న చైల్డ్‌ కిల్లర్‌ వైరస్
ప్రపంచాన్ని వణికిస్తున్న చైల్డ్‌ కిల్లర్‌ వైరస్

భారతదేశంలో కరోనా వైరస్‌ మరచిపోకముందే హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి.ఈ కొత్త వైరస్‌ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. వైరస్‌ను ఎదుర్కొనడానికి ప్రభుత్వం ప్రణాళికలు తీసుకుంటోంది.కానీ, ఇది Read more

హుస్సేన్ సాగర్ వద్ద నూతన సంవత్సరం: పోలీసుల ఆంక్షలు
హుస్సేన్ సాగర్ వద్ద నూతన సంవత్సరం: పోలీసుల ఆంక్షలు

2024 సంవత్సరానికి హైదరాబాద్ నగరం వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్న వేళ, నగరంలోని పోలీసు శాఖ సురక్షితంగా మరియు సంఘటనలు లేని నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు కఠిన Read more

రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి స్థానం లేకుండా పోయింది: జగన్‌
అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్ వాకౌట్

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శలు అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై Read more