Headlines
Chevireddy Bhaskar Reddy will be accused in the High Court.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు.. !

అమరావతి : వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గతంలో బాలికపై అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేశారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు తిరుపతి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో తాజాగా శుక్రవారం కోర్టు చెవిరెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది.

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడంతో పాటు సోషల్‌ మీడియాలో ప్రసారం చేశారన్న ఆరోపణలతో చెవిరెడ్డిపై కేసు నమోదైంది. వాస్తవాలు నిర్ధారించుకోకుండా అసత్య ప్రచారం చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు పెట్టారు.

ఇదిలా ఉండగా, గతంలో ఓ బాలిక విషయంలో చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా తిరుపతి పోలీసులు ఆయనపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బాలిక తండ్రి చెప్పినా.. గతంలో ఇచ్చిన వాంగ్మూలం రికార్డు చేశారు. దీంతో ఆయనపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని ఆయన తరఫున లాయర్స్ వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Best new artificial intelligence search engine. Clear cut e mailer solutions. Warehouse.