కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులకు సంబంధించి నిబంధనలను సులభతరం చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు.
సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిబంధనల్లో మార్పులు చేస్తూ జీవోలు జారీ చేశామని అన్నారు.
ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ – 2017లో సవరణలు చేస్తూ వేర్వేరుగా ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. లే అవుట్లలో రోడ్లకు గతంలో ఉన్న12 మీటర్లకు బదులు 9 మీటర్లకు కుదిస్తూ సవరణ చేశామని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకువచ్చామని అన్నారు. ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీలక సంస్కరణలతో ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి నారాయణ తెలిపారు.
నిబంధనల్లో మార్పులు
సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిబంధనల్లో మార్పులు చేస్తూ జీవోలు జారీ చేశామని అన్నారు. లే అవుట్లలో రోడ్లకు గతంలో ఉన్న12 మీటర్లకు బదులు 9 మీటర్లకు కుదిస్తూ సవరణ చేశామని చెప్పారు. 500 చ.మీ. పైబడిన స్థలాలు, నిర్మాణాల్లో సెల్లారుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్‌లు తొలగిస్తూ జీవో జారీ చేశామని తెలిపారు.