Headlines
Vaikuntha Darshan for those injured in the stampede

తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డ్డ‌వారికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

తిరుపతి: తిరుప‌తిలో వైకుంఠ ఏకాద‌శి ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల జారీ స‌మ‌యంలో జ‌రిగిన తొక్కిస‌లాటలో ఆరుగురు మృతిచెంద‌గా, అనేక మంది గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే ఈరోజు వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా.. ఆ తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డ్డ భ‌క్తులు ఇవాళ ద‌ర్శ‌నం క‌ల్పించారు. సీఎం చంద్ర‌బాబు, టీటీడీ చైర్మెన్ ఆదేశాల ప్ర‌కారం.. తొక్కిస‌లాటలో గాయ‌ప‌డ్డ‌వారికి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం ఏర్పాటు చేశారు. అధికారుల ప్ర‌కారం గాయ‌ప‌డ్డ వారిలో మొత్తం 52 మందికి ప్ర‌త్యేకంగా ఉత్త‌ర‌ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించారు. ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌నం కోసం అనేక మంది ప్ర‌ముఖులు కూడా తిరుమ‌ల‌కు చేరుకున్నారు.

image
image

కాగా, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్బంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. వేకువ జామున 3:45 గంటలకు శ్రీవారి అభిషేక సేవ అనంతరం టీటీడీ అధికారులు భక్తులకు దర్శనాన్ని ప్రారంభించారు. ప్రముఖులు సైతం తెల్లవారుజామునే స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం టీటీడీ ప్రొటోకాల్ ప్రకారం పూర్తి చేయబడింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మల్లు భట్టి విక్రమార్కలు స్వామిని దర్శించుకున్నారు. అలాగే ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, సవిత, నిమ్మల రామానాయుడు, పార్థసారథిలు కూడా శ్రీవారి దర్శనంలో పాల్గొన్నారు. అంతేకాదు ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబా, నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర మరియు సుహాసిని కూడా ప్రత్యేకంగా స్వామిని దర్శించుకున్నారు.

నేటి నుండి 19 జనవరి వరకు, టీటీడీ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని కేవలం టికెట్ లేదా టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే అనుమతిస్తుంది. ఈ 10 రోజుల కాలంలో శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయబడినట్లు టీటీడీ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(8) of the baltimore orioles oct. Advantages of overseas domestic helper. Rapat paripurna dprd kota batam, pemerintah kota batam ajukan 8 poin ranperda.