మహాకుంభ మేళాకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 45 కోట్ల మంది భక్తులు హాజరయ్యే ఈ భారీ కార్యక్రమం కోసం సుమారు రూ 7500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. భక్తుల కోసం యూపీ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. కుంభ సమయంలో పవిత్ర నదులలో స్నానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అదే విధంగా ఈ కుంభమేళా సమయంలో ఏ రోజున ఈ స్నానాలు చేయాలి.. వాటి ప్రత్యేకతలను సాదువులు వివరిస్తున్నారు. జనవరి 13న మాష్ పూర్ణిమ స్నానం తో మొదలై.. మహాశివరాత్రి తో కుంభమేళా ముగుస్తుంది.
ఆ ఆరు రోజులకు ప్రాధాన్యత ఈనెల 13వ తేదీ పౌర్ణమి తిథి నుంచి 26 ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు గంగ, యమున, సరస్వ తి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరగనుంది. కుంభమేళాలో మొదట నాగ సాధువులు స్నానం చేసి.. ఆత్మ శుద్ధి, తపస్సు లేకుండా ఎవరూ నిజమైన పుణ్యాన్ని పొందలేదని భక్తులకు ఒక సంకేతం ఇస్తారు. దేశం నలుమూలల నుండి యాత్రికులు గంగా, యమునా మరియు పౌరాణిక సరస్వతి నది సంగమం అయిన త్రివేణి సంగమం వద్ద స్నానాలు చేస్తారు. ఈ నెల 13న పౌష్ పూర్ణిమ స్నానంతో ప్రారంభమయ్యే మహాకుంభ మేళా..ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.