ఇటీవల కాలంలో విమానాలకు, స్కూల్స్ కు బాంబు బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. ఆమధ్య ఢిల్లీ స్కూళ్లకు వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. కాగా ఈ కేసులో ఢిల్లీ పోలీసులు గుట్టువిప్పారు. ఆ కేసులో 12వ తరగతి విద్యార్థి విద్యార్థిని అరెస్టు చేశారు. స్కూల్ ఎగ్జామ్స్‌ను తప్పించుకునేందుకు ఆ స్టూడెంట్ బెదిరింపు మెయిల్స్ చేసినట్లు గుర్తించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల వరుసగా స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ బెదిరింపుల వెనుక ఉన్న అసలు దొంగను ఢిల్లీ పోలీసులు పట్టేశారు. ఓ మైనర్ విద్యార్థి.. తన స్కూల్ పరీక్షలను తప్పించుకునేందుకు ఆ బెదిరింపులు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనలో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కస్టడీలోకి తీసుకున్నారు. స్కూళ్లకు బెదిరింపులు రావడంతో.. చాలా రోజుల ఢిల్లీలో ప్రభుత్వ అధికారులు హైరానాకు గురయ్యారు.
దాదాపు ఆరుసార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ చేశాడు ఆ స్టూడెంట్. అయితే ప్రతిసారి తన స్వంత స్కూల్ కాకుండా.. మిగితా స్కూళ్ల పేరు మీద అతను బెదిరింపు మెయిల్స్ చేసేవాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అతను ఆ ప్లాన్ చేశాడు. ప్రతిసారి అతను తన మెయిల్‌లో.. ఒకేసారి పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ చేసేవాడు. ఓ సారి ఏకంగా అతను 23 స్కూళ్లకు ఒకేసారి మెయిల్ చేశాడు.
స్కూల్‌లో పరీక్షకు హాజరు కావాలన్న ఉద్దేశం లేకపోవడంతో ఆ మైనర్ విద్యార్థి బాంబు బెదిరింపు మెయిల్స్ చేసినట్లు అధికారులు చెప్పారు. ఆ బెదిరింపుల వల్ల ఎగ్జామ్స్ రద్దు అవుతాయన్న ఉద్దేశంతో అతను అలా చేసినట్లు పసికట్టారు. డజన్ల సంఖ్యలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు రావడంతో.. కొన్ని వారాల పాటు ఢిల్లీ అధికారులు టెన్షన్ ఫీలయ్యారు. ఢిల్లీలో తానెప్పుడూ ఇలాంటి భయానక పరిస్థితి చూడలేదని విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు.