వ్యవసాయ రంగంలో రోబోల ప్రాముఖ్యత

Farming

వ్యవసాయ రంగంలో రోబోలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇవి పంటలు కోయడం నుండి మొదలుపెట్టి , విత్తనాలు వేయడం, ఎరువులు చల్లడం, కల్పు తీయడం, పంటకి నీరు పెట్టడం , భూమి దున్నడం , పండ్లు కోయడం వంటి శ్రమతో కూడిన పనులను నిర్వహించడానికి ఇవి రూపొందించబడ్డాయి. ప్రత్యేకంగా తయారైన సెన్సార్లను ఉపయోగించి, ఈ రోబోలు పంటలను గుర్తించి సమర్థవంతంగా పని చేస్తాయి. దీని వల్ల రైతులు సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా శ్రమని తగ్గించుకోవచ్చు. ఈ రోబోలు తక్కువ సమయంలో మనిషి కన్నా ఎక్కువ పని చేస్తాయి

వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు, కూలీల కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది గురిచేయడమే కాకుండా సాగును నష్టాల మయం చేస్తోంది .ఉదాహరణకి ఒక ఎకరంలో కలుపు తీయడానికి ఏడెనిమిది మంది కూలీల అవసరం. రసాయన మందుల పిచికారీ చేయడానికి, దుక్కి దున్నడానికి కలిపి ఖర్చు ఏడాదికి దాదాపు రూ. 25 వేల నుండి 50 వేల వరకు ఖర్చు అవుతుంది. అందుకే ఈ రోబోలు రైతుకు సాగు లో ఖర్చు తగ్గించుకోవడంలో చాల ఉపయోగకరంగా ఉంటాయి.వీటిని అన్ని రకాల పంటలలో ఉపయోగించవచ్చు.

చాల కంపెనీలు కృత్రిమ మేధస్సు, మిషన్ శిక్షణ వంటి టెక్నాలజీ ని ఉపయోగించి వ్యవసాయ రోబోలను తయారు చేయడంలో కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి . భవిష్యత్తులో, ఈ రోబోలు వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి చూపించి, ఆహార భద్రతను పెంచడానికి ముఖ్యమైన పాత్ర పోషించగలవు.

వ్యవసాయ రోబోలు రైతుల పనులను సులభతరం చేస్తూ, పంట ఉత్పత్తిని పెంచడంలో కీలకమైన సహాయంగా నిలుస్తాయి. పంట ఉత్పత్తి పెరగడం ద్వారా వ్యవసాయ ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *