ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మూవీ దేవర.. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. పది రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ మామూలు స్థితికి వచ్చాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ సోమవారం (11వ రోజు) మార్నింగ్ షోస్ నుండి అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంది. ఫలితంగా 11 వ రోజు ఈ చిత్రానికి కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి.
అక్టోబర్ 3 నుండి స్కూల్ మరియు కాలేజీ పిల్లలకు సెలవులు ఇవ్వడం ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చాయి. నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి దాదాపుగా 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది చిన్న విషయం కాదు, నైజాం ప్రాంతంలో ఈమధ్య వీకెండ్ తర్వాత వసూళ్లు రావడం చాలా కష్టం అయిపోయింది. కేవలం వీకెండ్స్ మాత్రమే మంచి వసూళ్లు వచ్చేవి. కానీ ‘దేవర’ చిత్రానికి ప్రతీ రోజు వీకెండ్ లో వచ్చిన వసూళ్లే వస్తున్నాయి.
ఇదిలా ఉంటె ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో ‘వార్ 2’ సినిమా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కి ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం విశేషం. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.