విక్రేతల వ్యాపార వృద్ధిని పెంచడానికి బహుళ ఉత్పత్తి విభాగాలలో విక్రయ రుసుముల పరంగా గణనీయమైన తగ్గింపును ప్రకటించింది. Amazon.inలో విక్రయదారులు తమ ఉత్పత్తి ఎంపికను విస్తరించడంలో సహాయపడటానికి కొత్త ఫీచర్లు మరియు పరిష్కారాలను పరిచయం చేసింది. తెలంగాణ నుండి 55,000 మంది విక్రేతలు Amazon.inలో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ మరియు భారతదేశంలోని విక్రేతలకు పండుగ సీజన్ 2024ను అతి పెద్ద విజయంగా మలచడానికి, అమెజాన్ వివిధ కార్యక్రమాలు మరియు ఆవిష్కరణలను తీసుకువచ్చింది. అమ్మకందారులు తమ ఆదాయాలను పెంచుకోవడానికి మరియు వినియోగదారులకు మెరుగైన ధరలను అందించడంలో సహాయపడటానికి, కిరాణా, ఫ్యాషన్ మరియు ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాలలో 3% నుండి 12% వరకు విక్రయ రుసుములలో గణనీయమైన తగ్గింపును ప్రకటించింది. దీపావళి షాపింగ్ రద్దీ కోసం విక్రేతలు తమ కార్యకలాపాలను మెరుగు పరిచేలా చేయడానికి మరియు పండుగల తర్వాత వ్యాపార వృద్ధిని కొనసాగించడానికి ఇది అవకాశాన్ని ఇస్తుంది.
పండుగల సీజన్, వినియోగదారుల చేసే ఖర్చు పరంగా గణనీయమైన వృద్ధి కారణముగా తెలంగాణలోని ఎస్ఎంబిలకు ఇ-కామర్స్ ద్వారా తమ ఆన్‌లైన్ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఒక పెద్ద అవకాశం లభిస్తుంది. ఈ సంవత్సరం, రాష్ట్రం నుండి 55,000 కంటే ఎక్కువ మంది విక్రేతలు తమ ఉత్పత్తులను Amazon.inలో జాబితా చేసి ప్రదర్శిస్తున్నారు. తద్వారా భారతదేశంలోని 100% సేవ చేయదగిన పిన్ కోడ్‌లలో తమ వినియోగదారులను చేరుకుంటున్నారు. పెరిగిన డిమాండ్, ట్రాఫిక్ మరియు ప్రత్యేక ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందడం ద్వారా, ఈ విక్రేతలు తమ అమ్మకాలను పెంచుకోవచ్చు మరియు కొత్త కస్టమర్‌లను చేరుకోవచ్చు.
అమెజాన్ ఇండియా వద్ద సేల్స్ డైరెక్టర్ గౌరవ్ భట్నాగర్ మాట్లాడుతూ, “అమెజాన్ వద్ద , ఈ-కామర్స్ ప్రయోజనాలను పొందడంలో సహాయం చేయడం ద్వారా తెలంగాణ ఎస్ఎంబిలను బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రతి సంవత్సరం, మేము వారి విక్రయాలను పెంచుకోవడంలో వారికి సహాయపడేందుకు మెరుగైన ఉత్పత్తుల జాబితాలు మరియు ఎంపికల ద్వారా పండుగ సీజన్‌కు వారిని సిద్ధం చేయడానికి వివిధ కార్యక్రమాలను రూపొందిస్తుంటాము. మేము అందించే మిగిలిన సొల్యూషన్‌లు మరియు ఫీచర్‌లతో పాటుగా విక్రయ రుసుము తగ్గింపు వంటి వాటి ద్వారా , పండుగ సీజన్‌లో మరియు అంతకు మించి అమ్మకందారులు అపూర్వమైన విజయాన్ని సాధించగలరని మేము విశ్వసిస్తున్నాము” అని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరియు మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) యొక్క శక్తిని అమెజాన్ ఉపయోగించుకుంటుంది. తద్వారా విక్రేతలు రిజిస్ట్రేషన్, లిస్టింగ్ మరియు అడ్వర్టైజింగ్, ఫోర్‌కాస్ట్ డిమాండ్, కేటలాగ్ క్వాలిటీ మరియు ప్రోడక్ట్ లిస్టింగ్‌లను మెరుగుపరచడం మరియు డీల్‌లు మరియు ప్రమోషన్‌లను సిఫార్సు చేయడం వంటి వారి కీలక కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. ఇది ఇటీవలే రూఫస్ యొక్క బీటా వెర్షన్‌ను ప్రారంభించింది, ఇది జెన్ ఏఐ ఆధారిత షాపింగ్ అసిస్టెంట్. అమెజాన్ యొక్క ఉత్పత్తి కేటలాగ్ మరియు వెబ్ అంతటా ఉన్న సమాచారంపై శిక్షణ పొందింది. షాపింగ్ అవసరాలు, ఉత్పత్తులు మరియు పోలికలపై కస్టమర్ ప్రశ్నలకు రూఫస్ సమాధానమివ్వగలదు, కోరుకున్న సమాచారం ఆధారంగా సిఫార్సులు చేయవచ్చు. ఇది Amazon.inలో విక్రేతల నుండి ఉత్పత్తులను కనుగొనడం మరియు పరిశోధించడం మరియు కొనుగోలు చేయడం కస్టమర్‌లకు సులభతరం చేస్తుంది.
అమ్మకందారులకు మద్దతుగా, అమెజాన్ సేల్ ఈవెంట్ ప్లానర్ వంటి అనేక కొత్త టూల్స్ మరియు ఫీచర్‌లను పరిచయం చేసింది, ఇది ప్రధాన విక్రయ ఈవెంట్‌లను నిర్వహించడంలో మరియు అమలు చేయడంలో,ఇమేజింగ్ సర్వీసెస్ మరియు లిస్టింగ్ అసిస్టెంట్‌ల వంటి ఏఐ -ఆధారిత ఆవిష్కరణలు చేయటం ద్వారా విక్రేతలకు సహాయం చేస్తుంది. స్వీయ-సేవ నమోదు (ఎస్ఎస్ఆర్ 2.0) బహుళ-భాషా మద్దతు మరియు క్రమబద్ధీకరించిన రిజిస్ట్రేషన్ , ఇన్‌వాయిస్ ప్రక్రియలతో బోర్డింగ్‌ను సులభతరం చేస్తుంది. అదనంగా, సేల్ ఈవెంట్ ప్లానర్ విక్రేతలకు అద్భుతమైన ఒప్పందాలను రూపొందించడంలో సహాయపడుతుంది మరియు సమర్థవంతమైన జాబితా ప్రణాళిక కోసం విలువైన పరిజ్ఞానంను అందిస్తుంది. కొత్త సెల్లర్ సక్సెస్ సెంటర్ ఆన్‌లైన్ షాపులను సెటప్ చేయడం మరియు యాడ్స్, ప్రైమ్ మరియు డీల్‌ల వంటి ఫీచర్‌లను ఉపయోగించడంపై వివరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. అమెజాన్ డెలివరీ నెట్‌వర్క్‌ని ఉపయోగించడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్‌లను చేరుకోవడానికి అమ్మకందారులకు మల్టీ-ఛానల్ ఫుల్‌ఫిల్‌మెంట్ (ఎంసిఎఫ్) సులభతరం చేస్తుంది.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో అమెజాన్ పెట్టుబడులు కస్టమర్‌లకు వేగవంతమైన మరియు నమ్మదగిన డెలివరీ అనుభవాన్ని అందిస్తాయి
సంవత్సరాలుగా, అమెజాన్ భారతదేశం అంతటా మరియు తెలంగాణలో శక్తివంతమైన భౌతిక మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు పెట్టుబడి పెడుతుంది. ఈరోజు అది తెలంగాణలో 06 పెద్ద ఫుల్‌ఫుల్‌మెంట్ సెంటర్‌లు మరియు 01 సార్టేషన్ సెంటర్‌తో పాటు దాదాపు 70 అమెజాన్ యాజమాన్యంలోని మరియు పార్టనర్ డెలివరీ స్టేషన్‌లు మరియు 1800 కంటే ఎక్కువ ‘ఐ హావ్ స్పేస్’ స్టోర్‌లను కలిగి ఉంది. మౌలిక సదుపాయాలపై ఈ పెట్టుబడులు తెలంగాణకు చెందిన అమ్మకందారులకు 100% సేవ చేయదగిన పిన్ కోడ్‌ల ద్వారా తమ కస్టమర్‌లకు డెలివరీ చేయడంలో సహాయపడుతున్నాయి మరియు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి.