హీరోయిన్ తో ఈనెల 13న నారా రోహిత్ ఎంగేజ్మెంట్

Nara Rohiths Engagement on

టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 13న హైదరాబాద్లో ఆయన ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన నటించిన ప్రతినిధి-2లో హీరోయిన్ గా కనిపించిన సిరి లేళ్లను రోహిత్ వివాహమాడనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణ.. తదితర కుటుంబ సభ్యులంతా హాజరు కాబోతున్నారు.

నారా రోహిత్ తెలుగు సినీ పరిశ్రమలో విలక్షనమైన సినిమాలు విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. బాణం సినిమాతో పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకుడు. ఆ తర్వాత నుంచి విభిన్నమైన సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు దివంగత నారా రామ్మూర్తినాయుడి రెండో కుమారుడు రోహిత్. రోహిత్ కు శిరీష్ అనే అన్న ఉన్నాడు. అతను కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. పెళ్లి వయసు వచ్చినప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వీరు వివాహానికి దూరంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. But іѕ іt juѕt an асt ?. , demanded a special counsel be appointed to investigate president biden over delays in military aid to israel.