బాలీవుడ్‌ న‌టుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు

actor govind

బాలీవుడ్‌ నటుడు, శివసేన లీడర్‌ గోవిందా ఇంట్లో గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ తెల్ల‌వారుజామున 4.45 గంట‌ల ప్రాంతంలో ఆయ‌న‌ రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో గాయ‌మైంది. ఘటన జరిగిన సమయంలో జుహు ఇంట్లో గోవిందా ఒంటరిగానే ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. గోవిందాను ఇంటికి సమీపంలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించ‌గా, చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వచ్చేశార‌ని పోలీసులు వెల్ల‌డించారు.

గోవిందా కోల్‌కతాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు ఆయ‌న మేనేజర్ శశి సిన్హా చెప్పారు. ఆయ‌న‌ తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ కింద పడిపోవ‌డంతో దాన్ని అల్మారాలో ఉంచే క్ర‌మంలో అది పేలి బుల్లెట్ గోవిందా కాలికి తగిలిందని వివ‌రించారు. దేవుడి దయ వల్లనే గోవిందా కాలికి గాయమైందని, పెద్దగా ఏమీ కాలేదని చెప్పారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది.

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. On lakkom waterfalls : a spectacular cascade in the munnar hills.