Pushpa2: పుష్ప-2 న్యూ అప్‌డేట్‌.. అల్లు అర్జున్‌ మాసివ్‌ లుక్‌తో న్యూపోస్టర్‌

allu arjun pushpa 2

అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప-2: ది రూల్ పుష్ప వంటి భారీ విజయాన్ని సాధించిన తర్వాత, ఈ సీక్వెల్ ప్రేక్షకులను మరింత కొత్త స్థాయికి తీసుకెళ్లేలా ఉండనుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు దాంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా చిత్రబృందం ముందుకుసాగుతోంది. పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 6న విడుదల కాబోతోంది ఇప్పటికే ఈ చిత్రం పట్ల భారీ స్థాయి ఆసక్తి నెలకొంది గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ అభిమానులు పుష్ప-2 కి సంబంధించి తాజా అప్‌డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు వారి నిరీక్షణకు ఫిల్మ్ మేకర్స్ తాజా అప్‌డేట్‌తో ముగింపు పలికారు ఇంకా 50 రోజుల్లో పుష్పరాజ్ రూల్ ప్రారంభం అంటూ భారీ పోస్టర్‌ను విడుదల చేశారు ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ మరింత ధీటైన మాసివ్ లుక్‌లో కనిపిస్తున్నారు. డాన్‌లా కూర్చొని ఉన్న ఆయన శక్తివంతమైన రూపం ప్రేక్షకులను మరింత ఆసక్తికి గురిచేస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పుష్ప-2 చిత్రానికి సంబంధించి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే వెయ్యి కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తయిందట దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందించిన రెండు పాటలను ఇప్పటికే విడుదల చేశారు ఆ పాటలు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందాయి మరి రెండు పాటలను నవంబరులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇదే కాకుండా పుష్ప-2 చిత్రానికి సంబంధించిన భారీ ప్రమోషన్లకు కూడా నిర్మాతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం త్వరలోనే మరింత భారీ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది ఆగమనానికి ముందు ఇంకా ఎన్నో సర్ప్రైజ్‌లు ఈవెంట్స్‌ ఉండనున్నట్లు సమాచారం ఈ విధంగా పుష్ప-2 మరింత అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్‌పై రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    It’s just that mоѕt оf the gаіnѕ frоm thаt hаvе gone tо thе top. Stuart broad archives | swiftsportx. Cinemagene編集部.