south korea president

దక్షిణ కొరియా అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్

దక్షిణ కొరియాలో రాజకీయ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. దక్షిణ కొరియా దర్యాప్తు సంస్థ అధికారులు ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఓ పక్క ఎమర్జెన్సీ వివాదం నేపథ్యంలో ఇప్పటికే యూన్ సుక్ యోల్ అభిశంసన ఎదుర్కొంటుండగా, మరో పక్క యూన్‌‌‌ను అరెస్టు చేసేందుకు దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా న్యాయస్థానం అందుకు అంగీకరించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
త్వరలోనే అరెస్టు?
మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు అధ్యక్షుడికి వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా, అనుకూలంగా 204 మంది ఓటు వేయగా, 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన తన అధ్యక్ష బాధ్యతలను, విధులను ప్రధాన మంత్రి హన్ డక్ సూకి అప్పగించాల్సి ఉంటుంది అయితే యూన్‌ను తప్పించాలా ? కొనసాగించాలా ? అన్న అంశాన్ని రాజ్యాంగ న్యాయస్థానం 180 రోజుల్లో తేల్చనుంది. కాగా, యూన్ సైతం అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు పేర్కొంటున్నారు.
సియోల్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు దర్యాప్తు సంస్థలోని ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు. త్వరలోనే అయనను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

president

విచారణకు గైర్హాజరు

యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటించడంపైనా దర్యాప్తు జరుగుతోంది. న్యాయవాదులతో పాటు పోలీస్, రక్షణ మంత్రిత్వశాఖ, అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన జాయింట్ టీమ్ అధ్యక్షుడిని విచారిస్తోంది. ఈ క్రమంలో మూడు సార్లు విచారణకు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు గైర్హాజరు కావడంతో అరెస్టు వారెంట్ కోరుతూ దర్యాప్తు అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Related Posts
అమెరికాలో అక్రమ వలసదారులపై కఠిన నిర్ణయం
TRUMP

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, అమెరికాలో అనధికారికంగా ఉండే పెద్ద సంఖ్యలో భారతీయులను స్వదేశానికి తిరిగి పంపించే ప్రక్రియను అమలు చేయాలని వాగ్దానం చేశారు. Read more

ఉక్రెయిన్ రష్యా పై దీర్ఘపరిమాణ మిసైల్స్ ప్రయోగం
ukraine long range missile

ఉక్రెయిన్, రష్యా పై యూఎస్ తయారుచేసిన ATACMS దీర్ఘపరిమాణ మిసైల్స్ ప్రయోగించినట్లు సమాచారం. ఈ దాడి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణు ఆయుధాల ఉపయోగానికి సంబంధించిన Read more

కెన్యా అధ్యక్షుడు అదానీతో ఒప్పందాలు రద్దు..
Adani

2024 నవంబర్ 21న కెన్యా అధ్యక్షుడు ఒక కీలక ప్రకటన చేశారు. ఆయన, భారతీయ పరిశ్రమ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీతో కలిసిన కొన్ని భారీ ఒప్పందాలను Read more

2024లో ట్రంప్ విజయం: భారత ప్రభుత్వానికి కీలక అంశాలు
india

ట్రంప్ 2.0 భారతదేశం మరియు దక్షిణాసియా దేశాలకు ఎలాంటి ప్రయోజనాలని తీసుకొస్తున్నాయి అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చించబడుతున్నాయి. ఆయన గతంలో తీసుకున్న విధానాలు, ఆయన ప్రతిపాదించిన పథకాలు Read more