Hamas key statement during Israeli attacks

Hamas: ఇజ్రాయెల్ దాడుల వేళ హమాస్ కీలక ప్రకటన

Hamas: మొదటి దశ కాల్పుల విరమణ ముగిసిన అనంతరం గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం భారీ వైమాణిక దాడులు చేయడంతో 400 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద సంస్థ హమాస్ కీలక ప్రకటన చేసింది. చర్చలకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని తెలిపింది. కాల్పుల విరమణ అమలు చేయాలని అందుకు గాను ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొంది. కాల్పుల విరమణను తిరిగి అమలు చేసేందుకు హమాస్ సిద్ధంగా ఉంది. కానీ జనవరి 19న అమల్లోకి వచ్చిన ఒప్పందంపై తిరిగి చర్చలు జరపబోము. చర్చలకు ఇంకా సమయం ఉంది. కానీ కొత్త ఒప్పందాలు అవసరం లేదు అని హమాస్ ప్రతినిధి తాహెర్ అల్ నును తెలిపారు.

Advertisements
ఇజ్రాయెల్ దాడుల వేళ హమాస్

గతంలో మాదిరిగానే అగ్రిమెంట్

తమకు ఎటువంటి షరతులూ లేవని, రెండో దశ కాల్పుల విరమణకు వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే అగ్రిమెంట్ ఉండాలని కానీ కొత్త ఒప్పందాలను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల ప్రారంభంలో ముగిసింది. అయితే రెండో దశ కాల్పుల విరమణ ఉంటుందని అంతా భావించినప్పటికీ దానికి సంబంధించిన చర్చలు ప్రారంభం కాలేదు. దీంతో మిగిలిన బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ హమాస్‌కు సూచించింది. కానీ హమాస్ దానిని పట్టించుకోకపోవడంతో ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది.

Related Posts
రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్
KTRs defamation suit against Konda Surekha. Hearing in court today

రేపు (అక్టోబర్ 18) నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరుకాబోతున్నారు. తనపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఆమెపై పరువు నష్టం దావా Read more

KTR: ప్రజాప్రతినిధులు అవయవ దానం చేయాలన్న కేటీఆర్,అందుకు నేను సిద్దమే
KTR: తెలంగాణలో అవయవ దానం పై కీలక ప్రకటన చేసిన కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఆయన అవయవ దానం చేసేందుకు సిద్ధమని ప్రకటించి, ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలిచారు. శాసనసభలో Read more

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ప్రారంభమైన నామినేషన్లు..!
Nominations have started for the election of the GHMC Standing Committee.

జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారి వద్ద నాలుగు నామినేషన్లు దాఖలు హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు కార్పొరేటర్ల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారి Read more

నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకం : డిప్యూటీ సీఎం
Self employment scheme for unemployed youth.. Deputy CM

హైదరాబాద్‌: నిరుద్యోగ యువతకి ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించనున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×