మళ్ళీ దేశాలకు ట్రంప్ వార్నింగ్..ఈ సారి ఏ విషయంలో అంటే!

Donald Trump VS Canada: కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్

Donald Trump VS Canada: కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్ అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై తీవ్ర విమర్శలు చేశారు. కెనడాను “దరిద్ర దేశాలలో ఒకటి” అంటూ వ్యాఖ్యానించారు.

Advertisements

ఒక ఇంటర్వ్యూలో కెనడాపై ఆయన ఎప్పుడూ ఎందుకు కఠినంగా ఉంటారో ప్రశ్నించగా ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను అన్ని దేశాలతో సంబంధాలు కొనసాగిస్తానని కానీ కెనడాతో వ్యవహరించడం చాలా కష్టమని ట్రంప్ అన్నారు.కెనడా చెత్త దేశాల్లో ఒకటిగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు కెనడాలో తీవ్ర దుమారం రేపాయి.అమెరికా కెనడాకు ఏటా 200 బిలియన్ డాలర్లు సబ్సిడీ అందిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.

Donald Trump కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్
Donald Trump VS Canada: కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్

అందుకే కొందరు కెనడాను 51వ రాష్ట్రంగా పరిగణిస్తున్నారని వివరించారు.అయితే అమెరికాకు కెనడా అవసరం లేదని, వారి కలప, శక్తి వనరులు, ఆటోమొబైల్స్ కూడా అవసరం లేదని స్పష్టం చేశారు.ఇటీవల మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, ట్రంప్ తన దురుసు మాటలను తగ్గిస్తేనే చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. కెనడాపై అమెరికా కఠిన వైఖరి అనవసరమని, పరస్పర అవగాహనతో సమస్యలు పరిష్కరించుకోవచ్చని కార్నీ అభిప్రాయపడ్డారు.ట్రంప్ వ్యాఖ్యలు కెనడా-అమెరికా సంబంధాలను మరింత విషమింపజేస్తాయా? లేదా, ఈ వివాదం త్వరలో సమసిపోతుందా అనేది చూడాలి.

Related Posts
Non Veg Lovers : నాన్ వెజ్ లవర్స్ మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
mutton2

నాన్ వెజ్ ప్రియులకు మటన్ అంటే అమితమైన ప్రేమ. దాని రుచితో పాటు వచ్చే వాసన కూడా చాలా మందిని ఆకట్టుకుంటుంది. ప్రోటీన్లు, విటమిన్లు, ఇనుము వంటి Read more

భద్రాచలంలో తెప్పోత్సవం
Teppotsavam at Bhadrachalam

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవాలు నిన్నటితో విజయవంతంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులకు స్వామి వారు ప్రతిరోజూ వేరువేరు అవతారాలలో Read more

Betting app : బెట్టింగ్‌ యాప్‌లకు అడ్డుకట్ట.. త్వరలోనే ఓ పాలసీ : మంత్రి లోకేశ్‌
A policy to curb betting apps will be issued soon.. Minister Lokesh

Betting app: మంత్రి నారా లోకేశ్‌ బెట్టింగ్‌ యాప్‌ల స్పందించారు. ఈ మేరకు బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌లను అరికట్టాలంటూ యూట్యూబర్‌ అన్వేష్ చేసిన పోస్ట్‌కు లోకేశ్‌ స్పందించారు. Read more

ఎండాకాలం మొదలైందోచ్
summer

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి, ఎండలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో ప్రజలు వేడికి తట్టుకోలేకపోతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఎండాకాలం ప్రభావం ముందుగానే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×