McDonald sign key agreement with Telangana government..!

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వంతో మెక్ డోనాల్డ్స్ కీలక ఒప్పందం..!

Telangana Govt : అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2,000 మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం అసెంబ్లీలోని ఛాంబర్లో మెక్‌ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

Advertisements
తెలంగాణ ప్రభుత్వంతో మెక్ డోనాల్డ్స్

పెట్టుబడుల ఒప్పందం

ఈ సందర్భంగా తమ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి మెక్ డొనాల్డ్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధుల బృందంలో సీఈవో తో పాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండయా హెడ్ దేశాంత కైలా చర్చల్లో ఉన్నారు.

ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం

మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రంలోనే స్థాపించాలని పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న సందర్భంలో మెక్ డొనాల్డ్ సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవటం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు.

Related Posts
నీటిని పీల్చుకునే ‘ట్రోవాంట్స్’ రాళ్లు ఉన్నాయనే సంగతి తెలుసా..?
Trovants

యూరప్లోని రొమేనియాలో ఉన్న వింత రాళ్లు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి. 'ట్రోవాంట్స్' అని పిలిచే ఈ ప్రత్యేకమైన రాళ్లు వర్షాలు పడిన తర్వాత వాటంతటవే పెరిగిపోతుంటాయి. Read more

ఫిబ్రవరి 15 లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌..!
Panchayat election schedule before February 15.

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఫిబ్రవరి 15 లోపే విడుదలయ్యే అవకాశం ఉన్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటిచిన Read more

ఇళయరాజా ఇంటికెళ్లిన సీఎం స్టాలిన్
cm stalin met ilayaraja

సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా, మార్చి 8వ తేదీన లండన్‌లో ఘనమైన సింఫనీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆసియా ఖండానికి Read more

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సోనూసూద్ సహాయం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సోనూసూద్ సహాయం!

వివరాల్లోకి వెళ్ళగా నటుడు మరియు దాత సోను సూద్ మరొకసారి ఆయన సేవ హయధేయన్ని చాటుకున్నారు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×