Spy Cameras : స్పై కెమెరాల ఆదేశాలు జారీ చేయలేమన్న హైకోర్టు

Spy Cameras : స్పై కెమెరాల ఆదేశాలు జారీ చేయలేమన్న హైకోర్టు

Spy Cameras : స్పై కెమెరాల ఆదేశాలు జారీ చేయలేమన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్రంలో మహిళా వసతి గృహాల్లో బాత్రూంలు గదుల్లో స్పై కెమెరాలు బయటపడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పై కెమెరాల విక్రయాలపై నియంత్రణ విధించాలని న్యాయవాది శ్రీరమ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.స్పై కెమెరాల నియంత్రణపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని నేడు తెలంగాణ హైకోర్టు విచారించింది. ఆన్‌లైన్ మార్కెట్‌లలో ఈ కెమెరాలు ఎలాంటి నియంత్రణ లేకుండా అమ్ముడవుతున్నాయని దుర్వినియోగానికి గురవుతున్నాయని శ్రీరమ్య కోర్టుకు తెలిపారు. మహిళల గోప్యతకు భంగం కలిగించే ఈ ఘటనలను నిరోధించేందుకు ప్రభుత్వ జోక్యం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

Advertisements
Spy Cameras స్పై కెమెరాల ఆదేశాలు జారీ చేయలేమన్న హైకోర్టు
Spy Cameras : స్పై కెమెరాల ఆదేశాలు జారీ చేయలేమన్న హైకోర్టు

ఇక కేంద్రం తరఫున హాజరైన న్యాయవాది ముఖర్జీ స్పై కెమెరాల దుర్వినియోగంపై ఇప్పటికే చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. అయితే న్యాయమూర్తి స్పందిస్తూ ప్రతి మొబైల్‌లోనూ కెమెరాలు ఉన్న వేళ, స్పై కెమెరాలను ప్రత్యేకంగా ఎలా నియంత్రించగలమని ప్రశ్నించారు.దీనిపై శ్రీరమ్య సమాధానమిస్తూ, మొబైల్ కెమెరాలను గుర్తించగలిగినప్పటికీ, స్పై కెమెరాలను రహస్యంగా అమర్చడం వల్ల బాధితులు ముందుగా తెలుసుకునే అవకాశం లేదని పేర్కొన్నారు. అందుకే వీటి విక్రయాలపై మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టును కోరారు.అయితే హైకోర్టు ఈ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఆదేశించే అవకాశంలేదని స్పష్టం చేసింది. దీనితో, ఈ అంశంపై మరిన్ని చర్చలు అవసరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related Posts
Ponnam Prabhakar : నేడు ఉత్తరాఖండ్కు పొన్నం, సీతక్క
ponnam sithakka2

తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు సీతక్క నేడు ఉత్తరాఖండ్‌కి వెళ్లనున్నారు. వారి పర్యటన ప్రధానంగా డెహ్రాడూన్‌లో నిర్వహించనున్న రెండు రోజుల చింతన్ శిబిర్ కార్యక్రమంలో Read more

ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
vijayasai reddy

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ , కాకినాడ సెజ్‌లోని వాటాలను Read more

రాహుల్ గాంధీపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదని మంత్రి శ్రీధర్ బాబు
Rahul Gandhi Warangal visit cancelled

కులం, మతం చూడకుండా ప్రజలను ఐక్యంగా చూడటమే కాంగ్రెస్ విధానం తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "రాహుల్ గాంధీ Read more

ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావాలి – ప్రధాని మోదీ
modi france speech

మానవాళికి ఏఐ అనేది ఒక కోడ్‌లా మారింది కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ ప్రపంచంలోని అన్ని దేశాలకు అందుబాటులోకి రావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×