Bhavana భర్తతో విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం

Bhavana : భర్తతో విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం

Bhavana : భర్తతో విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం మలయాళ సినీ పరిశ్రమ నుంచి ఒంటరి మహాత్మ వంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి భావన, గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై స్పందించారు. భర్త నుంచి విడాకులు తీసుకుంటోందన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు.తనపై వస్తున్న తప్పుడు వార్తలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భావన కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తున్న కథనాల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోకపోవడం వల్లే ఈ రకమైన అపోహలు వస్తున్నాయని పేర్కొన్నారు.

Advertisements
Bhavana భర్తతో విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం
Bhavana భర్తతో విడాకులు తీసుకుంటోందంటూ ప్రచారం

సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని షేర్ చేయాలనే బాధ్యత నాకు లేదు.నా భర్తతో కలిసి ఫొటోలు పోస్టు చేయకపోతేనే మేమిద్దరం విడిపోయినట్టా అని భావన ప్రశ్నించారు. తాము హ్యాపీ లైఫ్ గడుపుతున్నామని తమ ప్రైవసీకి విలువ ఇచ్చే వ్యక్తులమని ఆమె స్పష్టం చేశారు.వ్యక్తిగత జీవితాన్ని జనాల ముందుకు తీసుకురావడం తనకు ఇష్టం లేదని ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేయకపోతే అనవసరమైన ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు.భర్త నవీన్‌తో తమ అనుబంధం బలంగా ఉందని చెప్పిన భావన, ఇలాంటి వదంతులను నమ్మొద్దని అభిమానులను కోరారు.

తాము సంతోషంగా ఉన్నామనే విషయం తెలుసుకునే బదులుగా అసత్య కథనాలను వ్యాప్తి చేయడం బాధించిందని ఆమె అన్నారు.ప్రైవసీకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే తాను సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు పోస్టు చేయనని మరోసారి స్పష్టం చేశారు.ఆమె స్పష్టమైన వివరణతో ఈ రూమర్లు కొంతవరకు తగ్గనున్నాయని భావిస్తున్నారు.అభిమానులు నెటిజన్లు కూడా ఆమె వ్యాఖ్యలను స్వాగతిస్తూ ఆమె వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరుతున్నారు.

Related Posts
అనసూయ వచ్చిందని ఆర్టీసీ బస్టాండ్‌‌ క్లోజ్.! ఎక్కడంటే
anasuya bharadwaj

ప్రయాణికుల అసహనం పెరిగింది ఆర్టీసీ అధికారుల చర్యపై. తాజాగా కడప జిల్లా మైదుకూరు పట్టణంలో జరిగిన సంఘటనలో ఆర్టీసీ అధికారులు అనవసరంగా బస్టాండ్‌ను మూసివేసి ప్రయాణికులను ఇబ్బందులకు Read more

శ్రుతీహాసన్ గోత్ థీమ్‌తో సరికొత్తగా ఈ అమ్మడు.
Shruti Haasan

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు చిరపరిచితమైన పేరు శ్రుతీ హాసన్.తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోను తన అద్భుత నటనతో మెప్పించిన ఈ నటి,ఇటీవలే సూపర్ హిట్ మూవీ సలార్ Read more

Manmadhudu: వైజాగ్ బీచ్‌లో సందడి చేసిన మన్మథుడు హీరోయిన్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే:
actress anshu 2

అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రాలలో మన్మథుడు ఒకటి. 2002లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో సోనాలీ బింద్రే ప్రధాన కథానాయికగా నటించింది అయితే, ఈ Read more

తగ్గేదే లే అంటున్న సమంత
తగ్గేదే లే అంటున్న సమంత

సమంత, అందాల భామ, గత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. "ఏ మాయ చేశావే" సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, కొద్దికాలంలోనే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×