हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Zomato Swiggy: కస్టమర్లకు జొమాటో, స్విగ్గీ షాక్: వర్షం పడితే అదనపు ఛార్జీలు..!

Vanipushpa
Zomato Swiggy: కస్టమర్లకు జొమాటో, స్విగ్గీ షాక్: వర్షం పడితే అదనపు ఛార్జీలు..!

మీరు స్విగ్గీ లేదా జొమాటో నుండి ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్(Online food order) చేస్తుంటారా..? ముఖ్యంగా మీరు జొమాటో గోల్డ్లే(Zomato) లేదా స్విగ్గీ (Swiggy)వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారా.. ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ లాయల్టీ ప్రోగ్రామ్ యూజర్లకు గతంలో ఉన్న ‘రెయిన్ సర్‌ఛార్జ్’ (Rain Charges) మినహాయింపును తొలగించాయి. అంటే ఇప్పటి నుండి వర్షం పడినప్పుడు సాధారణ కస్టమర్లలాగానే మీరు కూడా అదనపు డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జొమాటో గోల్డ్ అండ్ స్విగ్గీ వన్ యూజర్లు వర్షాకాలంలో అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్ ఆర్డర్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఈ చార్జెస్ కేవలం సబ్‌స్క్రిప్షన్ లేని వారికి మాత్రమే వర్తించేది. కానీ ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ ఉన్నా లేకున్నా వర్షం పడినప్పుడు డెలివరీపై అదనపు ఛార్జీలు తప్పవు.

Zomato Swiggy: కస్టమర్లకు జొమాటో, స్విగ్గీ షాక్: వర్షం పడితే అదనపు ఛార్జీలు..!
Zomato Swiggy: కస్టమర్లకు జొమాటో, స్విగ్గీ షాక్: వర్షం పడితే అదనపు ఛార్జీలు..!

పెట్టుబడిదారుల ఒత్తిడిలో జొమాటో, స్విగ్గీ
ఈ నిర్ణయం వెనుక జొమాటో, స్విగ్గీ లాభాలను మెరుగుపరచుకోవాలనే పెట్టుబడిదారుల ఒత్తిడి ఉందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన గణాంకాలు ఈ కంపెనీల ఆర్థిక స్థితిని స్పష్టం చేస్తున్నాయి. జొమాటో (పేరెంట్ కంపెనీ ఎటర్నల్), 2024-25 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం (Q4 FY25)లో పన్ను తర్వాత లాభం (PAT) కేవలం రూ.39 కోట్లుగా ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.175 కోట్ల లాభంతో పోలిస్తే 78% తక్కువ. మరోవైపు, స్విగ్గీ నష్టాలు మరింత పెరిగాయి. Q4 FY25లో కంపెనీ నికర నష్టం రూ.1,081.18 కోట్లకు చేరుకుంది, గత ఏడాది ఇదే కాలంలో చూస్తే రూ.554.77 కోట్లుగా ఉంది. అంటే కంపెనీ నష్టం 94% కంటే ఎక్కువగా పెరిగింది.
ప్లాట్‌ఫామ్ ఫీజు 5 రెట్లు పెంపు
గత కొన్ని నెలలుగా స్విగ్గీ ఇంకా జొమాటో ప్రతి ఆర్డర్ నుండి ఎక్కువ ప్రాఫిట్ పొందడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇటీవలే ఈ రెండు కంపెనీలు ప్లాట్‌ఫామ్ ఫీజును 5 రెట్లు పెంచి రూ.10కి చేర్చాయి. అంతకుముందు ఈ ఫీజు ఆర్డర్‌కు కేవలం రూ.2 మాత్రమే ఉండేది. ఈ మొత్తం తక్కువగా అనిపించినా, ఈ రెండు కంపెనీలు రోజుకు 20 లక్షలకు పైగా ఫుడ్ ఆర్డర్‌లను డెలివరీ చేస్తాయి. కాబట్టి, ప్రతి ఆర్డర్‌పై రూ.10 వసూలు చేస్తే ప్రతి కంపెనీకి రోజుకు కనీసం రూ.2 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. మొత్తానికి కస్టమర్లకు కొంత భారం పడినప్పటికీ ఈ నిర్ణయాలు కంపెనీల ఆర్థిక స్థిరత్వానికి, లాభాల పెంపుకు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Bomb Blast : పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు.. నలుగురు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870