हिन्दी | Epaper
IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

chahal and dhanashree : యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మ విడాకులు

Vanipushpa
chahal and dhanashree : యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మ విడాకులు

ముగిసిన వివాహ బంధం
భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ,ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారి విడాకులను మంజూరు చేసింది. చాహల్ తరఫున న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా ఈ విషయాన్ని ధృవీకరించారు. విడాకుల పిటిషన్ విచారణ కోసం చాహల్, ధనశ్రీ ఇవాళ మధ్యాహ్నం కోర్టుకు హాజరయ్యారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున, ఆరు నెలల తప్పనిసరి విరామ గడువును బాంబే హైకోర్టు రద్దు చేసింది. మార్చి 20లోగా విడాకులపై తుది నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. విచారణ అనంతరం, కోర్టు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది.

 యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ విడాకులు


ధనశ్రీకు భరణం – చాహల్ అంగీకారం
ధనశ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు చెల్లించేందుకు చాహల్ అంగీకరించారు. ఇప్పటివరకు రూ.2.37 కోట్లు ఇప్పటికే చెల్లించినట్లు సమాచారం. మిగతా మొత్తం త్వరలోనే చెల్లించే అవకాశం ఉంది. 2020లో చాహల్, ధనశ్రీల వివాహం జరిగింది. వీరిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు, ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా గుర్తుండిపోయారు. గతంలో వీరి పోస్ట్‌లు, వ్యక్తిగత జీవితం గురించి వచ్చిన ఊహాగానాలు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి.
విడాకుల ఊహాగానాలు: సోషల్ మీడియా సంకేతాలు
విడాకులకు ముందు, సామాజిక మాధ్యమాల్లో అనుమానాస్పద సంకేతాలు వెలువడ్డాయి.
ధనశ్రీ తన పేరు నుండి ‘చాహల్’ పదాన్ని తొలగించడం, విడాకులపై ఊహాగానాలకు ఊతమిచ్చింది.
చాహల్, ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, వారి మధ్య విభేదాలున్నట్లు వెల్లడించింది. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు అధికారికంగా పూర్తయినప్పటికీ, వారి వ్యక్తిగత జీవితం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వీరి క్రియాశీలత తగ్గిపోవడంతో, వారి వ్యక్తిగత జీవితంపై మరింత ఆసక్తి నెలకొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870