हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

YS Jagan: జగన్‌ తెనాలి పర్యటనపై వేడెక్కిన రాజకీయాలు

Anusha
YS Jagan: జగన్‌ తెనాలి పర్యటనపై వేడెక్కిన రాజకీయాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Jaganmohan Reddy) తెనాలి పర్యటన నేపథ్యంలో తీవ్ర రాజకీయ వేడి నెలకొంది.కేసులున్నంత మాత్రాన రోడ్డుమీదే కొడతారా, అమాయకులను రౌడీషీటర్లుగా చిత్రీకరిస్తారా, అంటూ వైసీపీ ఆగ్రహావేశాలు వెల్లగక్కుతుంటే రౌడీలున్న పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందంటూ కౌంటర్‌ ఎటాక్‌కి దిగారు కూటమి నేతలు. కేసులుంటే రోడ్లపైనే కర్రలతో కొడతారా, చంద్రబాబుపైనా 24 కేసులున్నాయ్‌, ఆయన విషయంలోనూ ఇలాగే ప్రవర్తిస్తారా,అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు జగన్‌. దళితులను కొట్టి రౌడీషీటర్లుగా ముద్రవేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారాయన. ప్రభుత్వ పద్దతి అసలేం బాలేదన్నారు.ఏపీలో అరాచక పాలన నడుస్తోందన్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu). అమాయకులను కొడితే ఏమొస్తుందన్నారు, గుర్తుపెట్టుకోండి లెక్కకు లెక్క తేలుస్తామంటూ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు.

కౌంటర్‌ ఎటాక్‌

అలాగే వైసీపీ నేతల మాటలకు ఇటు కూటమి పార్టీల నేతలు కూడా తగ్గేదేలే అన్నట్లు కౌంటర్‌ ఎటాక్‌కి దిగారు. నందిగం సురేష్‌, బోరుగడ్డ అనిల్‌ లాంటి రౌడీలున్న పార్టీ వైసీపీ అంటూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌(Kuna Ravikumar)విమర్శలు గుప్పించారు.

YS Jagan: జగన్‌ తెనాలి పర్యటనపై వేడెక్కిన రాజకీయాలు
YS Jagan

వేధించిన

టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల కూడా జగన్‌ తెనాలి పర్యటనపై ఫైర్ అయ్యారు. రఘురామకృష్ణంరాజు(Raghuramakrishnam Raju)పై దాడి చేసిన వాళ్లను ఏం చేయాలన్నారు, జగన్‌ తెనాలి వెళ్లి ఏం సందేశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు జనసేన నేతలు కూడా జగన్‌ పర్యటన, వైసీపీ నేతల కామెంట్స్‌పై కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఎంతోమందిని వేధించిన వాళ్లకు మాట్లాడే అర్హతే లేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. మొత్తంగా జగన్‌ తెనాలి పర్యటన రాజకీయ రచ్చ లేపింది.

Read Also: Sajjala Ramakrishna Reddy: కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే వ్యతిరేకత: సజ్జల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870