ప్రతి నెల ఉద్యోగి జీతం నుండి కొంత మొత్తం ఈపీఎఫ్ఒకి కట్ వుతుంటుంది, దీనిని మీరు మర్చిపోయిన భవిష్యత్తులో మీకు డబ్బు అవసరమైనపుడు చాల ఉపయోగపడుతుంది. మీరు జాబ్ మానేయాల్సి వచ్చినప్పుడు లేదా అత్యవసర వైద్య పరిస్థితి ఎదురైనప్పుడు, పిల్లల చదువు కోసం ఖర్చులకి డబ్బు కావాలన్నా లేదా మీ సొంత ఇంటిని నిర్మించుకోవాలన్న ఈ PF డబ్బు మీకు సహాయపడుతుంది. కానీ దీనిపై సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలా మంది డబ్బు అవసరమైనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు కూడా మీ PF అకౌంట్ నుండి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇలా చేస్తే చాలు మీ అకౌంట్లో డబ్బు వచ్చి చేరుతుంది.

PF విత్ డ్రా చేసుకోవడానికి కారణాలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మెంబర్స్ కొన్ని కారణాల మీద PF విత్ డ్రా చేసుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత, ఉద్యోగం మానేసిన తర్వాత లేదా మరణించిన తర్వాత పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇల్లు కట్టడం, పిల్లల చదువు, పెళ్లి లేదా అత్యవసరంగా వైద్య పరిస్థితి ఏర్పడితే కూడా PF డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. EPF (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) అనేది ఒక సేవింగ్స్ స్కిం, ఇందులో ఉద్యోగి, కంపెనీ ఇద్దరు ప్రతినెల కొంత మొత్తాన్ని జమ చేస్తాయి. ఈ డబ్బు మీ భవిష్యత్తుకు ఒక సేఫ్ ఫండ్స్’లాగ పనిచేస్తుంది. ప్రతి ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్ లింక్ చేసిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఇస్తారు. దీనితో PF బ్యాలెన్స్ ఈజీగా చెక్ చేయవచ్చు అలాగే అవసరమైతే విత్ డ్రా చేసుకోవచ్చు.
PF విత్ డ్రా సులభమైన పద్ధతి
*లాగిన్: మొదట మీ UAN అండ్ పాస్‌వర్డ్‌తో EPFOపోర్టల్ లేదా ఉమాంగ్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. *ఆన్లైన్ సర్వీస్: హోమ్ పేజీలోని ఎంటర్ అయ్యాక ‘ఆన్లైన్ సర్వీసెస్’ అప్షన్ క్లిక్ చేసి ‘క్లెయిమ్’ పై క్లిక్ చేయండి. *బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్: ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ చేసి ‘continue’ పై నొక్కండి. *క్లెయిమ్ ఫామ్ నింపండి: ‘PF అడ్వాన్స్ ఫామ్ 19’ ని సెలెక్ట్ చేసుకోని విత్ డ్రాకి కారణం ఇంకా మొత్తాన్ని ఎంటర్ చేయండి. *డాకుమెంట్స్ అప్లోడ్ : బ్యాంక్ పాస్‌బుక్ లేదా చెక్కు స్కాన్ చేసిన ఫోటో అప్లోడ్ చేయాలి. *ఆధార్ వెరిఫికేషన్ : ఆధార్ నంబర్ ద్వారా వెరిఫై చేసి ఫామ్‌ను సబ్మిట్ చేయండి. దీని తరువాత, మీ క్లెయిమ్ ప్రాసెస్ అవుతుంది, ఇచ్చిన సమయంలోపు డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది.
ఎన్ని రోజుల్లో డబ్బు వస్తుందంటే
అప్లికేషన్ సబ్మిట్ చేసిన 7 నుండి 10 వర్కింగ్ డేస్’లో డబ్బు బ్యాంకు అకౌంట్లో నేరుగా జమ చేయబడుతుంది. ఉద్యోగి ఆధార్ నంబర్ పీఎఫ్ అకౌంట్‌కి అనుసంధానిస్తే, ఈ ప్రక్రియ మరింత ఈజీ అవుతుంది. ఆధార్ నంబర్ సహాయంతో డాకుమెంట్స్ చెక్ చేయాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. అందువల్ల డబ్బు త్వరగా అందుతుంది. ఈ ఫెసిలిటీ ఉద్యోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బు త్వరగా పొందడంలో సహాయపడుతుంది. రూల్స్ & జాగ్రత్తలు: ఆలస్యం లేదా రిజెక్షన్ జరగకుండా ఉండడానికి PF విత్ రూల్స్ అర్థం తెలుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఒక ఉద్యోగి ఉద్యోగం మానేసిన తర్వాత రెండు నెలలు నిరుద్యోగిగా ఉంటే అతను మొత్తం PFని విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు PF విత్ డ్రాకి కొన్ని పరిస్థితులలో మాత్రమే ఉంటుంది.