దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది.

ఎన్నికల వేళ భారీ డిస్కౌంట్స్

దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. బుధవారం ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఇతర సామాగ్రితో పోలింగ్ సిబ్బంది బూత్‌లకు తరలి వెళ్తోన్నారు. 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 699 మంది అభ్యర్థులు నిలిచారు. ముఖ్యమంత్రి ఆతిషి సహా 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 83,49,645 మంది పురుషులు, 71,73,952 మంది మహిళలు, 1,261 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు. వీరందరూ గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు.

csm salon quer 2018 layers end 3a3d383d87

సీనియర్ సిటిజన్ల ఓట్లు 24,44,320 ఉండగా.. 80 సంవత్సరాలకు మించి వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 2,77,221. చాలామంది ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కూడా. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వంటి ప్రముఖులూ ఇంటి నుంచే ఓటు వేశారు.15 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని ఏలుతోంది. 2014 తరువాత మరో పార్టీకి అవకాశమే ఇవ్వట్లేదు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని గెలిపిస్తూ వస్తోన్నారు. 2020 నాటి ఎన్నికల్లోనూ చరిత్ర తిరగరాసింది ఆప్. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 62 స్థానాలను కొల్లగొట్టింది. ఇప్పుడూ అలాంటి రికార్డే సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా- పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఛాంబర్స్ ఆఫ్ ట్రేడర్స్ అండ్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ 50 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీని పరిధిలోని అన్ని దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కిరాణా షాపులు, హోటళ్లు, మాల్స్, ధాబాలు, కాఫీ షాపులు.. ఇలా అన్నింట్లోనూ 20 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Related Posts
తెలంగాణ రాజ్ భవన్ లో ఎట్ హోం
Telangana Raj Bhavan

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్‌లో "ఎట్ హోం" కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తన ఆధ్వర్యంలో తేనీటి విందును నిర్వహించారు. Read more

కొత్త ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన వైష్ణోయ్ గ్రూప్..
Vaishnoi Group launched a new landmark project

రియల్ ఎస్టేట్ లో దూరదృష్టి కలిగిన వ్యక్తి, దాత అయిన వైష్ణోయ్ గ్రూప్ వ్యవస్థాపకుడు యెలిశాల రవి ప్రసాద్ తెలంగాణా రియల్ ఎస్టేట్ రంగ తీరుతెన్నులను మార్చడానికి Read more

జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న తుది దశ పోలింగ్‌
final phase of voting is ongoing in Jammu and Kashmir

final phase of voting is ongoing in Jammu and Kashmir శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రెండు దశలు Read more

అమ్మకాల్లో ఆపిల్ ఐఫోన్స్‌ సరికొత్త రికార్డ్
అమ్మకాల్లో ఆపిల్ ఐఫోన్స్‌ సరికొత్త రికార్డ్

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్స్ రంగంలో ఆపిల్ ఐఫోన్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్స్‌లోని భద్రతా ఫీచర్స్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటాయి. అయితే Read more