మరోసారి కాకాణి గోవర్దన్ రెడ్డికి నోటీసులు

Kakani Govardhan Reddy: మరోసారి కాకాణి గోవర్దన్ రెడ్డికి నోటీసులు!

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం హైదరాబాద్‌లో నెల్లూరు పోలీసులు వెతుకుతున్నారు. నగరంలోని ఆయన 3 ఇళ్ల వద్దకు పోలీసులు వెళ్లారు. ఇంట్లో ఆయన లేకపోవడంతో బంధువులకు నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్‌ 1న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.

Advertisements
మరోసారి కాకాణి గోవర్దన్ రెడ్డికి నోటీసులు

ఏప్రిల్‌ 1న హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు

అక్రమ మైనింగ్‌, రవాణాకు పాల్పడ్డారంటూ పొదలకూరు పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో సోమవారం విచారణకు ఆయన రాకపోవడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఏప్రిల్‌ 1న హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఆదివారం నెల్లూరులోని ఇళ్లలోనూ కాకాణి ఆచూకీ లభించలేదు. దీంతో అక్కడి ఇంటి గోడకు నోటీసులు అంటించారు.

నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణ

కాగా, ఈ కేసులో కాకాణిని విచారించేందుకు నెల్లూరు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయనకు నోటీసులు ఇస్తున్నారు. నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ ఎవరూ లేకపోవడం, వాళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Related Posts
తెలంగాణలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్: 7 మంది హతమయ్యారు..
maoists

తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 7 మావోయిస్టులు, ఒక టాప్ కమాండర్ సహా మరణించారు. ఈ సంఘటన ఉదయం 5:30 గంటల సమయంలో చల్పాకా అరణ్యాల్లో Read more

బిజెపి నేతతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సెల్ఫీ
MP Shashi Tharoor selfie

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఈ Read more

అబద్ధాల అడ్డ అరవింద్ కేజ్రీవాల్: జేపి నడ్డా
అబద్ధాల అడ్డ అరవింద్ కేజ్రీవాల్: జేపి నడ్డా

బిజెపి చీఫ్ జెపి నడ్డా, అరవింద్ కేజ్రీవాల్ అవినీతి మరియు మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు, ఆయనను "అబద్ధాల ఎన్సైక్లోపీడియా" అని అభివర్ణించారు. అదే సమయంలో ఫిబ్రవరి 5న Read more

జగిత్యాల జిల్లాలో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
RTC bus accident

జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ వెళ్లే రోడ్డులో ఆర్టీసీ బస్సు ఢీకొని తూర్పాక తిరుపతమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. జగిత్యాల బుడిగజం గాల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×