Secunderabad : సికింద్రాబాద్ లో యువ వైద్యుడి ఆత్మహత్య.. ఎందుకంటే!

Secunderabad : సికింద్రాబాద్ లో యువ వైద్యుడి ఆత్మహత్య.. ఎందుకంటే!

సికింద్రాబాద్‌లో ఓ యువ వైద్యుడు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వయస్సు పెరుగుతున్నా వివాహం కాకపోవడం, నిశ్చితార్థం అయ్యాక సంబంధం రద్దవడం వల్ల కలిగిన మనోవేదన అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.బుధవారం ఉదయం సికింద్రాబాద్‌లోని బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్యావలరీ బ్యారక్‌ రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైలు పట్టాలపై యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన లోకో పైలెట్ వెంటనే జీఆర్పీ (రైల్వే) పోలీసులకు సమాచారం అందించారు.

పెళ్లి సంబంధం

తర్వాత కిషోర్ కు వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు సంబంధాలను చూస్తున్నా కుదరడం లేదు దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కిషోర్‌ తన ద్విచక్రవాహనంపై ఇంట్లో నుంచి బటయకు వెళ్లాడు ఆ తర్వాత బొల్లారం వెళ్లి అక్కడ రైల్వేస్టేషన్‌ వద్ద వాహనాన్ని ఉంచాడు.అనంతరం సమీపంలోని క్యావలరీ బ్యారక్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతానికి చేరుకున్న కిషోర్ని జామాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న హుజూర్‌సాహిబ్‌ నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పురోహిత్ కిషోర్

గుజరాత్‌కు చెందిన ప్రకాష్ మాల్ కుటుంబం కొన్నేళ్లుగా సికింద్రాబాద్‌లో స్థిరపడింది. ప్రకాష్ మాల్ చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ (34) ఓ బస్తీ దవాఖానాలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు.34 ఏళ్లు ఉన్నతంగా చదువుకున్నాడు వైద్య వృత్తి సమాజంలో మంచి పేరు కూడా ఉంది, కానీ పెళ్లి కావడంలేదు బట్ట తల ఉందని అమ్మాయిలు పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నారు,ఈ క్రమంలోనే ఓ సంబంధం కుదిరింది,ఇటీవల నిశ్చితార్ధం కూడా జరిగింది,కానీ బట్టతల ఉందని,అమ్మాయి పెళ్లిని ఆపింది.దీంతో కుదిరిన సంబంధం కూడా అర్ధాంతరంగా నిలిచిపోవడంతో పురోహిత్ కిషోర్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు ,చివరకు ట్రైన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

1200 675 18484032 thumbnail 16x9 suicide aspera

అవగాహన

వయస్సు పెరుగుతున్నా వివాహం కాని వారిపై కుటుంబాలు, సమాజం ఒత్తిడి పెంచడం,బట్టతల, శరీర ఆకృతి వంటి కారణాలతో పెళ్లి సంబంధాలు రద్దు కావడం,తన కుంటుంబానికి అపఖ్యాతి వస్తుందనే భయం వ్యక్తులను తీవ్ర నిర్ణయాలకు దారితీస్తోంది.

మానసిక ఆరోగ్యం

మానసిక ఆరోగ్యం విషయంలో అవగాహన పెంచుకోవడం, అవసరమైన సందర్భాల్లో మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఎంతో అవసరం.అతని వద్ద ఉన్న గుర్తింపు కార్డు చిరునామా ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు.అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. 

Related Posts
కౌశిక్ రెడ్డి అరెస్టు దారుణం: కెటిఆర్
కౌశిక్ రెడ్డి అరెస్టు దారుణం కెటిఆర్

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఖండించారు. తప్పుడు కేసులు పెట్టడం, బీఆర్ఎస్ నాయకులను తరచుగా అరెస్టు చేయడం Read more

Telangana Budget : రేపు తెలంగాణ బడ్జెట్
Telangana Assembly special session start postponed

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించేందుకు మంత్రివర్గ సమావేశం రేపు (ఉదయం 9.30 గంటలకు) అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం Read more

పసుపు బోర్డుకు చట్టబద్ధత లేక ప్రయోజనాలు అందడం లేదు: కవిత
Turmeric Board is not getting any legitimacy or benefits.. Kavitha

హైదరాబాద్‌: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత తాజాగా నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలపై స్పందించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు Read more

Hyderabad: రైలులో అత్యాచార కేసులో పోలీసుల అదుపులో నిందితుడు
Hyderabad: MMTS రైలులో అత్యాచారయత్నం కేసులో నిందితుడు అరెస్ట్

హైదరాబాద్‌లోని MMTS రైల్లో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచారయత్న ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బాధిత యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడి కోసం పోలీసులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *