తల్లికి వందనంపై నారా లోకేష్ కీలక ప్రకటన

బెదిరించడం మీకే అలవాటు :నారా లోకేశ్‌

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు రెండో రోజు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా 19మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17 మందిని బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వాల‌ని కోరారు. ఆధారాలు ఇస్తే ఇప్పుడే విచారణకు ఆదేశిస్తాన‌న్నారు. అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి లోకేశ్‌ సవాల్ విసిరారు.
వైస్ చాన్సలర్లను మేం బెదిరించలేదు
వైస్ చాన్సలర్లను మేం బెదిరించడం ఏమిటి? గవర్నర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలు నడుస్తాయ‌ని, ఎవరు బెదిరించారో చెప్పమనండి అంటూ మంత్రి మండిప‌డ్డారు. గతంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ ను రూమ్ లోకి వెళ్లకుండా తాళం వేసిన‌ మీరా మాట్లాడేది? అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మీ వ్యాఖ్యలను వెంట‌నే ఉపసంహరించుకోవాల‌ని తెలిపారు. వీసీలు తప్పుచేశారు కనుకే రాజీనామా చేసి వెళ్లిపోయార‌ని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

Advertisements
బెదిరించడం మీకే అలవాటు :నారా లోకేశ్‌


సామాజిక న్యాయం చేసాం
వీసీ పదవుల కోసం 500 మంది దరఖాస్తు చేశార‌ని, గత ప్రభుత్వం మాదిరి ఆ పోస్టులను ఒకే వర్గానికి కట్టుబట్టలేదన్నారు. సామాజిక న్యాయం చేశామ‌ని, విద్యావేత్తలను వీసీలుగా నియమించిన‌ట్లు తెలిపారు. గతంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ రూమ్ కి తాళాలు వేశారు. బెదిరించడం, భయపెట్టడం, బయటకు పంపడం మీ అలవాటు అని దుయ్య‌బ‌ట్టారు. ముఖ్యమంత్రి సభలకు మీలా మేం స్కూలు పిల్లలను పంపలేదని మంత్రి లోకేశ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. పరదాలు కట్టుకొని తిరగడం, తీర్పులు చెప్పిన జడ్జిల భార్యలపై పోస్టులు పెట్టడం మీ వాళ్లకు అలవాటు, ఈ కేసులో ఇప్పటికే కొందరు జైలులో ఉన్నారని మంత్రి లోకేశ్‌ చెప్పారు.

Related Posts
ఏపీలో ఇంటర్ అమ్మాయి దారుణ హత్య
Inter girl brutally murdere

ఏపీలో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హత్యలు , అత్యాచారాలు ఇలా ఎన్నో జరుగుతుండగా..తాజాగా ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైంది. కర్నూలు (D) నగరూరుకు Read more

మహిళా వైద్యురాలిపై జనసేన ఇన్ ఛార్జ్ ఆగ్రహం పార్టీ నుంచి వేటు
మహిళా దినోత్సవం రోజునే జనసేన నేత వివాదం – పార్టీ నుంచి సస్పెన్షన్

ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జనసేన పార్టీకి చెందిన కొంత మంది నేతలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అధికారానికి అండగా, స్థానిక స్థాయిలో ఆచితూచి Read more

చెవిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
bhaskar reddy

తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై నమోదైన ఓ కేసులో హైకోర్టులో చుక్కెదురు అయింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా Read more

లోకేశ్ సంక్రాంతి గిఫ్ట్.. రిప్లై ఇచ్చిన బ్రాహ్మణి
brahmaninara

సంక్రాంతి పండుగ వేళ, మంత్రి నారా లోకేశ్ తన భార్య బ్రాహ్మణికి మంగళగిరి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మంగళగిరి చేనేతను ప్రోత్సహించడం, Read more