వలసదారులను వెనక్కి పంపడం అమెరికాకే నష్టం: ఆర్ధిక వేత్తలు

మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు: ట్రంప్

ఆధునిక ప్రపంచంలో ప్రచన్నయుద్ధాల నుంచి నేరుగా యుద్ధాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో కొన్ని దేశాల దురుద్దేశాలు ఉండటమే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా కొత్త అధ్యక్షుడు ఎవ్వరూ ఊహించని షాకింగ్ కామెంట్స్ చేయటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా మయామీలో మాట్లాడుతూ మూడో ప్రపంచ యుద్ధం గురించి కీలక కామెంట్స్ చేశారు. థర్డ్ వరల్డ్ వార్ రావటానికి ఎంతో దూరం లేదని అయితే తాను అధ్యక్షుడిగా ఉండగా దానిని సమర్థవంతంగా నివారిస్తానంటూ చేసిన కామెంట్స్ ప్రపంచ దేశాల నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది. మయామిలో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ సమ్మిట్‌లో ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ ఒక విధంగా వాస్తవానికి కొంత దూరంగానే ఉన్నాయనే వాదన ఉన్నప్పటికీ ప్రపంచంలో అనేక దేశాల మధ్య జరుగుతున్న పోరును చూస్తుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా పూర్తిగా కొట్టివేయలేనిదిగా చాలా మంది చెబుతున్నారు.

మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు: ట్రంప్


విపత్తును నివారిస్తా
తన నాయకత్వంలో ఇలాంటి విపత్తును నివారిస్తానని అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికి హామీ ఇచ్చారు. రష్యా ఉక్రెయిన్, ఇరాన్ ఇరాక్ సహా ప్రపంచ వ్యాప్తంగా మరికొన్ని దేశాల్లో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్న సందర్భంలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తాను ఈ యుద్ధాలను ముగించి శాంతిని స్థాపించటం తన కర్తవ్యమని ట్రంప్ అన్నారు. అందరూ చంపబడటం చూసి తాను తట్టుకోలేకపోతున్నానని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధాలను అంతం చేయడానికి తాను అత్యవసర చర్యలు తీసుకుంటున్నానన్నారు. బైడెన్ అధ్యక్షుడిగా మరో ఏడాది ఉండిఉంటే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదంటూ ట్రంప్ అన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవను ప్రపంచం ప్రశాంతంగా ఉండటానికి తాను కృషి చేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ఉక్రెయిన్ జెలెన్స్కీ నాశనం చేస్తున్నారు
ఇప్పటికై రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని నివారించటానికి అమెరికా చర్చలు జరుపుతోందని త్వరలోనే దీనికి పరిష్కారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ ప్రశంసించారు. తనకు ఇష్టమైన ఉక్రెయిన్ దేశాన్ని జెలెన్స్కీ అనే చెడ్డ నాయకుడు నాశనం చేశాడని కామెంట్ చేశారు. ఈ క్రమంలో జెలెన్స్కీ అనవసరంగా లక్షలాది మంది మరణాలకు కారణమయ్యాడని ట్రంప్ పేర్కొన్నారు.

Related Posts
ఇజ్రాయెల్ మారణ హోమం
israel attack

గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌పై మరోసారి విరుచుకుపడింది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించడానికి కొన్ని గంటల ముందు మారణ హోమాన్ని సృష్టించిందక్కడ. డ్రోన్ దాడులతో కల్లోలాన్ని Read more

బంగ్లాదేశ్‌లో రోహింగ్యా శరణార్థుల సహాయాన్ని తగ్గించిన ఐక్యరాజ్యసమితి
బంగ్లాదేశ్‌లో రోహింగ్యా శరణార్థుల సహాయాన్ని తగ్గించిన ఐక్యరాజ్యసమితి

బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శరణార్థులు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనున్నారు. నిధుల కొరత కారణంగా UN ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) శరణార్థులకు అందించే రేషన్‌ను సగానికి తగ్గిస్తున్నట్లు Read more

అమెరిక పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్‌
Minister Nara Lokesh who went on a visit to America

శాన్‌ఫ్రాన్సిస్కో : ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్నారు. ఈ సదర్భంగా అక్కడ Read more

అంతరిక్షం నుండి ఓటు హక్కు వినియోగించుకోవచ్చా..?
sunita williams

అంతరిక్షంలో ఓటు వేయడం అనేది సాంకేతికత మరియు ప్రజాస్వామ్య సమర్థతను పరీక్షించే ఒక గొప్ప ఉదాహరణ. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నాసా ఖగోళవిజ్ఞానిగా ప్రసిద్ధి చెందిన Read more