हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Women Driver: ఆర్టీసిలో తొలి మహిళా డ్రైవర్ గా సరిత

Sharanya
Women Driver: ఆర్టీసిలో తొలి మహిళా డ్రైవర్ గా సరిత

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) లో తొలి మహిళా డ్రైవర్ (First female driver) బాధ్యతలు చేపట్టారు. తొలి మహిళా డ్రైవర్ ఒక గిరిజన మహిళ చేరారు. తొలి మహిళా డ్రైవర్ బాధ్యతలు చేపట్టిన సరితను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించగా, రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

తొలి మహిళా డ్రైవర్ గా సరిత

తెలంగాణ ఆర్టీసిలో తొలి మహిళా డ్రైవర్గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సిత్య తండా కు చెందిన వి సరిత (sarita) మిర్యాలగూడ డిపోలో జెబిఎం సంస్థ నుండి ఆర్టీసి ఎలక్ట్రిక్ బస్సు మహిళా డ్రైవర్ గా విధుల్లో చేరారు. సరిత హైదరాబాద్ టూ మిర్యాలగూడ బస్సును నడుపుతున్నారు. గతంలో ఢిల్లీలో రవాణా సంస్థలో 10 సంవత్సరాలు డ్రైవర్ విధులు నిర్వహించారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తనకు స్వస్థలంలో డ్రైవర్గా అవకాశం ఇవ్వాలని ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసిన సరిత మంత్రికి విజప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆర్టిసి అధికారులతో జెబిఎం సంస్థ ప్రతినిధులతో మాట్లాడి మిర్యాలగూడ డిపో నుండి నియమించారు. తనకు అవకాశం ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్కి మహిళా డ్రైవర్ సరిత ధన్యవాదాలు తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని ఇప్పటికే మహాలక్ష్మీ పథకం ద్వారా ఆరిటిసిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు చేపట్టా మని.. తాజాగా ఆర్టీసిలో మహిళా డ్రైవర్గా అవకాశం ఇవ్వడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలు పురుషులతో సమా నంగా అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

అభినందించిన రేవంత్ రెడ్డి

వాంకుడోతు సరితకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరితకి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఆర్టీసి బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో, మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగని పేర్కొన్నారు. మహిళలు విద్య, విజ్ఞానం, వృత్తి, వ్యాపారం, క్రీడలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు. గృహ బాధ్యతలు, సమాజ నిర్మాణంలోనూ మహిళల పాత్ర అపూర్వమైనదిగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించి మహిళలు విజయాల బాటలో ముందుకెళ్తున్నారని, ఈ క్రమంలో సరిత అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని సిఎం గుర్తుచేశారు. కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందడుగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

శాశ్వత డ్రైవర్ గా ఉద్యోగం ప్రకటించాలి

వేయాలని ఆర్ టిసిలో శాశ్వత డ్రైవర్గా ఉద్యోగం కల్పించాలి. తెలంగాణ ఆర్టీసిలో తొలి మహిళా డ్రైవర్ అయిన సరితకు ఆర్టీసిలో పర్మినెంట్ డ్రైవర్గా ఉద్యోగం కల్పించి ఆమెకు గౌరవం కల్పించేలా చూడాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి, ఆర్టిసి మేనేజంగ్ డైరెక్టర్ సజ్జ నార్కు స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్ డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. డ్రైవర్ సరితను ఆర్టీసిలో నియమించకుండా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ అయిన జెబిఎం సంస్థలో, అది కూడా మంత్రి సహకారంతో తాత్కా లిక ఉద్యోగం కల్పించి ఆమెకు సరైన గౌరవం కల్పించక పోవడం, పైగా జెబిఎం సంస్థలో ఉద్యోగం ఇప్పించడమే గొప్పపని అన్నట్లు పత్రికలకు ప్రక టన విడుదల చేయడం అత్యంత బాధాకరమని సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ రావ్ అన్నారు.

Read also: Telangana : నందగిరి గ్రామ సమీపంలోని ప్రమాదకరంగా ఎస్సారెస్పీ వంతెన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870