ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ లో పనిచేయాలని చాలా మంది కలలు కంటుంటరు. కానీ మైక్రోసాఫ్ట్ సంస్థ మాత్రం మరోసారి తొలగింపులు చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మే నెలలో ఈ తొలగింపులు జరగవచ్చు. తొలగింపులకు గల కారణాలు చూస్తే కంపెనీ టీం నిర్మాణాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోందట. దింతో మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగులు తొలగింపుల సమస్యలను ఎదుర్కోనున్నారు. ఈసారి మిడిల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాల తగ్గింపు ప్రభావితం కావచ్చని చెబుతున్నారు, అయితే ప్రాజెక్ట్ టీంలలో ఇంజనీర్ల సంఖ్య నాన్-టెక్నికల్ ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉండాలని కంపెనీ కోరుకుంటోంది. ఈ విధానం అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ సూచించిన విధానాన్ని పోలి ఉండనుంది.

టీంలో ఎక్కువ భాగం కోత
అయితే మేనేజర్ల సంఖ్యా ఎలా పెంచాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయని ఈ విషయం తెలిసిన వర్గాలు తెలిపినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ నివేదించింది. దీని అర్థం ఇప్పుడు ఒక మేనేజర్ ఎక్కువ మంది ఉద్యోగులను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎంత మంది ఉద్యోగాలు కోల్పోతారు అనేది ప్రస్తుతం స్పష్టంగా తెలియకపోయినా, టీంలో ఎక్కువ భాగం కోత కావచ్చని నివేదికలో పేర్కొంది. మరోవైపు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గత ఏడాది డిసెంబర్‌లో వైస్ ప్రెసిడెంట్లు అండ్ మేనేజర్ల సంఖ్యను 10% తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెల్సిందే. ఈ సంవత్సరం మొదట్లో సుమారు 2 వేల ఉద్యోగాల తగ్గింపు తర్వాత కంపెనీలో ఈ మార్పు జరగనుంది. అయితే గత ఏడాది చివరి నుండే టెక్ రంగాన్ని ఉద్యోగాల కొత, తొలగింపులు పట్టి పీడిస్తున్నాయి. తొలగింపుల వల్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొద్దిరోజుల క్రితం ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగాల కోత ప్రకటిస్తూ వెంటనే ఆఫీస్ క్యాంపస్ నుండి వైదొలగాలని కోరింది.
READ ALSO: Hot Air Balloon: హాట్ ఎయిర్ బెలూన్ నుంచి కిందపడి వ్యక్తి మృతి