हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TPCC : వారం రోజుల్లో టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు?

Sudheer
TPCC : వారం రోజుల్లో టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) కొత్త కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ (Congress) అధిష్ఠానం ఈసారి వీలైనంత ఎక్కువ మంది నేతలకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అందులో భాగంగా, టీపీసీసీకి 35 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులతో కూడిన జంబో కార్యవర్గాన్ని వారం రోజుల లోపే ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనివల్ల రాష్ట్ర స్థాయిలో పార్టీ మరింత బలపడుతుందనే ఆశక్తికర అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నామినేటెడ్ పదవులకు రాజీనామా

ఇకపోతే, ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు పార్టీలో పదవులు ఆకాంక్షిస్తే, ముందుగా తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాలని పార్టీ కొత్త నిబంధన విధించనున్నట్లు సమాచారం. ఈ మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టంచేసినట్టు తెలిసింది. దీనివల్ల పార్టీ భవిష్యత్తులో నిబద్ధతతో కూడిన నాయకత్వం ఎదగాలనే ఉద్దేశం స్పష్టమవుతోంది.

మల్లికార్జున ఖర్గే తో సీఎం రేవంత్ భేటీ

ఈ నేపథ్యంలో టీపీసీసీ కొత్త కార్యవర్గ కూర్పుపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో కలిసి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కొత్త కార్యవర్గానికి నాయకుల ఎంపిక, సమాఖ్య ప్రతినిధుల పాత్ర, మరియు భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Read Also : Ram Charan : లండన్‌లో రామ్‌చరణ్‌ను కలిసిన ప్రఖ్యాత బాక్సర్ జూలియన్ ఫ్రాన్సిస్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870