బడ్జెట్లో భారీగా రాజధాని అమరావతికి కేటాయింపులు

ఏపీ బడ్జెట్ దేనికెంత కేటాయింపు

ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి  బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు.రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, అభివృద్ధి, సంక్షేమం, రాజధాని నిర్మాణం, రైతు సంక్షేమం వంటి రంగాలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. బడ్జెట్‌లో ‘సూపర్‌ సిక్స్‌’ పథకాల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలు ప్రభుత్వ మేనిఫెస్టోలో కీలకంగా ఉండగా, ఈ బడ్జెట్‌లో వాటి అమలుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.’అన్నదాత సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతుకు రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా కుటుంబంలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి రూ.15,000 అందించబడుతుంది. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు వర్తిస్తుంది.

Advertisements

బడ్జెట్ హైలైట్స్

మొత్తం బడ్జెట్ – రూ. 3,22,000 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ. 2,51,162 కోట్లు
మూలధన వ్యయం – రూ. 40,635 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 33,185 కోట్లు
ద్రవ్య లోటు – రూ. 79,926 కోట్లు.

ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు

వ్యవసాయం – రూ. 48,000 కోట్లు
పోలవరం ప్రాజెక్టు – రూ. 6,705 కోట్లు
అన్నదాత సుఖీభవ పథకం – రూ. 6,300 కోట్లు
పాఠశాల విద్య – రూ. 31,805 కోట్లు
ఉన్నత విద్య – రూ. 2,506 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ – రూ. 1,228 కోట్లు.

1894773 payyavulakeshav

సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు

బీసీ సంక్షేమం – రూ. 47,456 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ. 20,281 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ. 8,159 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం – రూ. 5,434 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం – రూ. 4,332 కోట్లు.

ముఖ్యమైన రంగాలు

పంచాయతీ రాజ్ శాఖ – రూ. 18,847 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ – రూ. 13,862 కోట్లు
గృహ నిర్మాణ శాఖ – రూ. 6,318 కోట్లు
జలవనరుల శాఖ – రూ. 18,019 కోట్లు
ఆర్ అండ్ బీ (రోడ్లు & భవనాలు) – రూ. 8,785 కోట్లు
ఇంధన శాఖ – రూ. 13,600 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి & ప్రచారం – రూ. 10 కోట్లు.

బడ్జెట్ ప్రత్యేకతలు

సూపర్ సిక్స్ పథకాల అమలుకు అధిక నిధులు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత విద్యుత్, ఆరోగ్య భీమా వంటి పథకాలకే అధిక కేటాయింపులు,
రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రాధాన్యం.
గ్రామీణ, పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.

Related Posts
రిపబ్లిక్ డే పరేడ్లో ఏపీ శకటానికి 3వ స్థానం
AP Shakatam in Delhi Republ

రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీ కర్తవ్యపథ్‌లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ శకటం మూడో స్థానాన్ని దక్కించుకుంది. రసాయనాల వాడకం లేకుండా, సంప్రదాయ ఏటికొప్పాక బొమ్మలతో ప్రత్యేకంగా Read more

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్‌పై కేసులు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్‌పై కేసులు.కుంభమేళాలో పవిత్రస్నానం చేసిన పవన్ ఫొటోలు మార్ఫింగ్‌.ఏపీలో పలుచోట్ల నమోదవుతున్న కేసులు.తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ Read more

ఇప్పట్లో తల్లికి వందనం లేనట్టేనా!
talliki vandanam

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తల్లికి వందనం పథకం అమలు ఇప్పట్లో లేదని తెలుస్తున్నది. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కారణం.. తల్లికి వందనం Read more

డిసెంబరు 16 నుండి ధనుర్మాసం ఆరంభం
danurmasam

✍️డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం 👉డిసెంబరు 17వ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై తిరుమల:తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా Read more

×