ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు.రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, అభివృద్ధి, సంక్షేమం, రాజధాని నిర్మాణం, రైతు సంక్షేమం వంటి రంగాలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. బడ్జెట్‌లో ‘సూపర్ సిక్స్’ పథకాల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ‘సూపర్ సిక్స్’ పథకాలు ప్రభుత్వ మేనిఫెస్టోలో కీలకంగా ఉండగా, ఈ బడ్జెట్‌లో వాటి అమలుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.’అన్నదాత సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతుకు రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా కుటుంబంలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి రూ.15,000 అందించబడుతుంది. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు వర్తిస్తుంది.
బడ్జెట్ హైలైట్స్
మొత్తం బడ్జెట్ – రూ. 3,22,000 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ. 2,51,162 కోట్లు
మూలధన వ్యయం – రూ. 40,635 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 33,185 కోట్లు
ద్రవ్య లోటు – రూ. 79,926 కోట్లు.
ముఖ్యమైన రంగాలకు కేటాయింపులు
వ్యవసాయం – రూ. 48,000 కోట్లు
పోలవరం ప్రాజెక్టు – రూ. 6,705 కోట్లు
అన్నదాత సుఖీభవ పథకం – రూ. 6,300 కోట్లు
పాఠశాల విద్య – రూ. 31,805 కోట్లు
ఉన్నత విద్య – రూ. 2,506 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ – రూ. 1,228 కోట్లు.

సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు
బీసీ సంక్షేమం – రూ. 47,456 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ. 20,281 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ. 8,159 కోట్లు
అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం – రూ. 5,434 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం – రూ. 4,332 కోట్లు.
ముఖ్యమైన రంగాలు
పంచాయతీ రాజ్ శాఖ – రూ. 18,847 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ – రూ. 13,862 కోట్లు
గృహ నిర్మాణ శాఖ – రూ. 6,318 కోట్లు
జలవనరుల శాఖ – రూ. 18,019 కోట్లు
ఆర్ అండ్ బీ (రోడ్లు & భవనాలు) – రూ. 8,785 కోట్లు
ఇంధన శాఖ – రూ. 13,600 కోట్లు
తెలుగు భాష అభివృద్ధి & ప్రచారం – రూ. 10 కోట్లు.
బడ్జెట్ ప్రత్యేకతలు
సూపర్ సిక్స్ పథకాల అమలుకు అధిక నిధులు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత విద్యుత్, ఆరోగ్య భీమా వంటి పథకాలకే అధిక కేటాయింపులు,
రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రాధాన్యం.
గ్రామీణ, పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.