हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: సీఎస్‌కే ఓటమి పై ధోనీ ఏమన్నారంటే?

Anusha
IPL 2025: సీఎస్‌కే ఓటమి పై ధోనీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే).. మరోసారి గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. చిన్నస్వామి వేదికగా చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో ఆతిథ్య రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) చెన్నైని 2 పరుగుల తేడాతో ఓడించి మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. బెంగళూరు నిర్దేశించిన 214 పరుగుల ఛేదనలో సీఎస్‌కే 20 ఓవర్లలో 211/5 వద్దే ఆగిపోయింది. ఆయుష్‌ మాత్రె (48 బంతుల్లో 94, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారానికి తోడు రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్‌, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఆఖర్లో తడబడ్డ చెన్నైకి ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ విరాట్‌ కోహ్లీ (33 బంతుల్లో 62, 5 ఫోర్లు, 5 సిక్సర్లు), జాకబ్‌ బెతెల్‌ (33 బంతుల్లో 55, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రొమారియా షెపర్డ్‌ (14 బంతుల్లో 53 నాటౌట్‌, 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 213/5 చేసింది.

ఆరంభం

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ ఈ ఓటమికి తానే కారణమని చెప్పాడు. చివర్లో తాను కొన్ని షాట్స్ ఆడాల్సిందని, తన వైఫల్యం వల్లే ఒత్తిడి పెరిగిందని విచారం వ్యక్తం చేశాడు.’నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు విజయానికి కావాల్సిన పరుగులను చూస్తే నేను కొన్ని భారీ షాట్స్ ఆడి ఉంటే బాగుండేది. ఈ ఓటమికి నేనే బాధ్యుడిని. ఆర్‌సీబీకి అద్భుతమైన ఆరంభం దక్కింది. అయినా మేం మిడిల్ ఓవర్లలో పుంజుకున్నాం. కానీ రొమారియో షెపర్డ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. బౌలర్లు ఏ బంతులు వేసినా సిక్సర్లు బాదాడు. డెత్ ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేసేందుకు మేం యార్కర్లు వేయడం ప్రాక్టీస్ చేయాలి. తరుచూ యార్కర్లు వేయాల్సిన అవసరం లేదు. కానీ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై పరుగులు కట్టడి చేయాలంటే యార్కర్లే కీలకమవుతాయి. కచ్చితమైన యార్కర్ సాధ్యం కాకపోతే లో-ఫుల్‌ టాస్ వేయాలి. లో-ఫుల్ టాస్‌ను భారీ షాట్‌గా మల్చడం చాలా కష్టం.

 IPL 2025: సీఎస్‌కే ఓటమి పై ధోనీ ఏమన్నారంటే?

ఆడటం

పతీరణ వంటి బౌలర్ యార్కర్లు సాధ్యం కాకపోతే పేస్‌ను నమ్ముకొని బౌన్సర్లు వేస్తాడు. బ్యాటర్లను ఇబ్బంది పెడుతాడు. కొన్నిసార్లు యార్కర్లు వేసే క్రమంలో లైన్ మిస్సైతే బ్యాటర్లు భారీ షాట్స్ ఆడుతారు. కొందరు బ్యాటర్లు స్కూప్ షాట్స్‌తో పరుగులు రాబడుతారు. అయితే అందరికీ స్కూప్ షాట్స్ ఆడటం సాధ్యం కాదు. సహజంగా ఈ షాట్ ఆడితే ఏ సమస్య లేదు. అలా కాకుండా ప్రయత్నిస్తే మాత్రం ఎంతటి గొప్ప బ్యాటర్‌కు అయినా ఇబ్బంది అవుతుంది. ఈ తరంలో అందరూ ఈ స్కూప్ షాట్స్ ఆడటం నేర్చుకోవాలి. మా బ్యాటర్లలో చాలా మంది స్కూప్ షాట్స్ ఆడటం లేదు. జడేజా ఒక్కడే సౌకర్యవంతగా ఈ షాట్ ఆడగలడు.’అని ధోనీ చెప్పుకొచ్చాడు.

Read Also :IPL 2025: సీఎస్‌కే పై ఆర్‌సీబీ ఘన విజయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

📢 For Advertisement Booking: 98481 12870