Telangana weather alert : తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేటి నుంచి రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఈ అకాల వర్షాలు పడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రంగారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని హెచ్చరించారు.
Read Also: Swarna Grama Ward Sachivalayam: సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచనలు ఉండగా, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: